ఐఎఫ్ఎ 2014.. లెనోవో శుభారంభం

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ లెనోవో బుధవారం ఐఎఫ్ఎ 2014 (IFA 2014) ప్రచార పర్వాన్ని తనదైన శైలిలో ప్రారంభించింది. టెక్నాలజీ ప్రియులను ఉత్సాహపరుస్తూ ఇంటెల్ ప్రాసెసర్ పై స్పందించే సరికొత్త ఆండ్రాయిడ్  కిట్‌క్యాట్ టాబ్లెట్‌ను లెనోవో ప్రకటించింది. ‘టాబ్ ఎస్8' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఆండ్రాయిడ్ ఎడిషన్ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ 8 అంగుళాల తాకేతెరను కలిగి ఉంటుంది. ధర 199 డాలర్లు (భారత్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.12,000 ఇంచుమించుగా). హైస్పీడ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీని ఈ డివైస్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్లిమ్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలంచినట్లయితే...

ఐఎఫ్ఎ 2014.. లెనోవో శుభారంభం

8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్),
16:10 ఐపీఎస్ ప్యానల్,
ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ జెడ్3745,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4290 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo at IFA 2014: Tab S8 with 8-Inch Screen, Intel Processor Officially Announced. Read more in Telugu Gizbot...
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot