‘లెనోవో’ నిక్కార్సైనా ప్రొఫెషనల్స్ కోసం!!

Posted By: Super

‘లెనోవో’ నిక్కార్సైనా  ప్రొఫెషనల్స్ కోసం!!

నిక్కార్సైన ఫీచర్లతో నిక్కచ్చిగా పనిచేసే ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?, ఇంకెందుకు ఆలస్యం సరికొత్త ‘లెనోవో బడ్జెట్ ల్యాపీ’తో మీ హుందతనాన్ని మరింత పెంచుకోండి.


ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ‘లెనోవో’ విడుదల చేసిన ‘B570’ బడ్జెట్ ల్యాప్ టాప్ మన్నకైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది.

విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 320 జీబీ హార్డ్ డ్రైవ్, 6-in-1 కార్డ్ రీడర్, బ్లూరే డిస్క్, డీవీడీ RW రైటర్, 2.0 స్పీకర్స్, 802.11 b/g/ n వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ పోర్ట్సు తదితర మన్నికైన అంశాలను ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

ల్యాపీ డిస్ ప్లే మరియు కెమెరా అంశాలను పరిశీలిస్తే, 15.6 అంగుళాల స్క్రీన్ 1366 x 768 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఏర్పాటు చేసిన హై-డెఫినిషన్ కెమెరా 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. మన్నికైన కీబోర్డు వ్యవస్థ సులువైన టైపింగ్ కు ఉపరకరిస్తుంది.

2.35కిలో గ్రాములు బరువుతో ఈ గ్యాడ్జెట్ ను డిజైన్ చేశారు. నలుపు రంగులో లభ్యమవుతున్న ‘లెనోవో B570’ పటిష్ట ఇంటెల్ 82579LM జిగాబిట్ ల్యాన్ కనెక్టువిటీ వ్యవస్థను కలిగి ఉంటుంది. శక్తివంతమైన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ మార్కెట్ ధర రూ.30,000 లోపు ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot