మార్కెట్లోకి కొత్తశ్రేణి లెనోవో కంప్యూటింగ్ ఉత్పత్తులు!

|
మార్కెట్లోకి కొత్తశ్రేణి లెనోవో కంప్యూటింగ్ ఉత్పత్తులు!

ప్రముఖ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ లెనోవో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. లెనోవో ఏ సీరిస్ నుంచి విడుదలైన ఈ ట్యాబ్లెట్ మోడళ్లు ఈ విధంగా ఉన్నాయి....

 

లెనోవో ఏ1000: 7 అంగుళాల స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.8,999.

మరో ట్యాబ్లెట్ లెనోవో ఏ3000: 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), మీడియా టెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీ హెచ్ఎస్ పీఏ+ సపోర్ల్, వాయిస్ కాలింగ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.16,999.

మరో ట్యాబ్లెట్ మోడల్ ‘లెనోవో ఎస్6000': 10.1 అంగుళాల వెడల్పు స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.2గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8.6మిల్లీమీటర్ల మందం, బరువు 560 గ్రాములు, వై-ఫై, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఫోన్, హెచ్ఎస్‌పీఏ+, ధర రూ.27,000.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా లెనోవో ప్రీమియమ్ మోడల్ విండోస్ 8 ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. పేరు ‘ఐడియాప్యాడ్ లెనక్స్ కె3011'. ఫీచర్ల విషయానికొస్తే... డిటాచబుల్ కీబోర్డ్ డిజైన్, లేటెస్ట్ వర్షన్ ఇంటెల్ ప్రాసెసర్, విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.51,990.

లెనోవో నుంచి విడుదలైన మరో థింక్‌ప్యాడ్ ఉత్పత్తి పేరు ‘థింక్‌ప్యాడ్ ట్యాబ్లెట్ 2' ఫీచర్ల విషయానికొస్తే......10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, విండోస్8 ప్రో ఆపరేటింగ్ సిస్టం, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, బరువు 565 గ్రాములు, ఆప్షనల్ బ్లూటూత్ డాక్, మల్టీ మానిటర్ సపోర్ట్, ధర రూ.50,000 (పన్నులు కలుపుకోకుండా).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X