లెనోవా కొత్త టాబ్లెట్ 'లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1'

Posted By: Super

లెనోవా కొత్త టాబ్లెట్ 'లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1'

కంప్యూటర్ల తయారీ రంగంలో లెనోవా కంపెనీది అందెవేసిన చేయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కంప్యూటర్లతో పాటు, టాబ్లెట్ మార్కెట్ కూడా రోజు రోజుకి బాగా ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసేటటువంటి కంపెనీలు ప్రత్యేకంగా టాబ్లెట్ల మీద దృష్టిని సారించాయి. గతంతో పోల్చినట్లైతే టాబ్లెట్ల రంగం కూడా బాగా రాణిస్తుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో టాబ్లెట్ల రంగంలో రారాజులుగా వెలుగోందుతున్న కంపెనీలు శ్యామ్ సంగ్, మోటరోలా, యాపిల్, హెచ్‌టిసి, ఏసర్.

పైన పేర్కోన్న వాటితో పోల్చినట్లేతే టాబ్లెట్ల రంగంలో ముందుకు దూసుకుపోతున్న లెనోవా కంపెనీ త్వరలో తన అమ్ముల పోది నుండి స్లీక్ అండ్ సెక్సీ టాబ్లెట్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరే 'లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1'. లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1 ఫీచర్స్ గనుక మనం చూసినట్లేతే 10.1 ఇంచ్ డిస్ ప్లే సిస్టమ్‌ని కలిగి ఉండి, ఆండ్రాయిడ్ 3.1 వర్సన్ హానీకొంబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఫెర్పామెన్స్ స్పీడ్‌గా ఉండడానికి, మల్టీ టాస్కింగ్ పనులు వేగవంతంగా చేయడం కోసం ఇందులో 1GHz NVIDIA Tegra 2 ప్రాసెసర్‌తో రూపోందించడం జరిగింది.

అంతేకాకుండా ఇందులో ఆండ్రాయిడ్ ఆధారిత గేమ్స్‌ని రన్ చేసుకునేందుకు గాను 1GB RAMని అమర్చడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న యూత్‌ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోని లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1 చాలా స్టయిల్‌గా, అందంగా రూపోందించడం జరిగింది. యూజర్స్‌కి కావాల్సినటువంటి కలర్‌ని కూడా అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. ఇక ఎంటర్టెన్మెంట్, మల్టీమీడియా విషయంలో చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను, ఆడియో, వీడియో ప్లేబ్యాక్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు అయినటువంటి h263, h264 ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

వీటితోపాటు బాహ్యా స్పీకర్స్‌కు కనెక్టు చేసుకునేందుకుగాను టాబ్లెట్‌తో పాటు 3.5 mm యూనివర్సల్ ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ అయిన వైర్ లెస్ టెక్నాలజీ వై-పై‌, బ్లూటూత్ 2.1 వర్సన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే టాబ్లెట్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ ఉండగా, వీడియో కాలంగ్ చాటింగ్ కోసం టాబ్లెట్ ముందు భాగంలో 2 మెగా ఫిక్సల్ కెమెరాని రూపోందించడం జరిగింది. లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1తో పాటు 32 జిబి మొమొరీ లభిస్తుండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక లెనోవా ఐడియా ప్యాడ్ టాబ్లెట్ కె1 ధరను మాత్రం ప్రస్తుతానికి మార్కెట్లో వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot