లెనోవో..డెల్..సామ్‌సంగ్!

Posted By: Staff

లెనోవో..డెల్..సామ్‌సంగ్!

మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ అక్టోబర్ 26న విడుదలవుతున్న నేపధ్యంలో లెనోవో, డెల్, సామ్‌సంగ్‌ల భవిష్యత్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న అంశం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇంకా అసస్‌లు మాత్రమే విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రకటించాయి. తాజాగా మౌంటెన్ వ్యాలీ కంపెనీ ధృవీకరించిన సమాచారం మేరకు సామ్‌సంగ్, డెల్, లెనోవోలు విండోస్ 8 టాబ్లెట్ పీసీలను త్వరలో ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పటికే కంప్యూటర్ల నిర్మాణ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థలు ‘విండోస్ 8’ ప్లాట్ ఫామ్ తో మరిన్ని అద్భతాలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన సర్‌ఫేస్ ఆర్‌టి టాబ్లెట్ ఫీచర్లు:

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

.37మిల్లీమీటర్ల మందం,

676 గ్రాముల బరువు,

విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,

పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,

ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot