టివి, కంప్యూటర్ రెండూ ఒకేదానిలో...

Posted By: Super

టివి, కంప్యూటర్ రెండూ ఒకేదానిలో...

ఒకే ఒక్క 'కీ' తో మొత్తం ఫంక్షనాలిటీ అందుబాటులోకి తెచ్చే విధంగా లెనోవా ఓ సూపర్ కంప్యూటర్‌ని రూపొందించింది. దాని పేరే 'లెనోవా ఐడియా సెంటర్'. ఇటీవల కాలంలో టెక్నాలజీ బ్లాగులకు చెందిన నిపుణులు మాట్లాడుకుంటున్న ప్రస్తుత టాపిక్ లెనోనా ఐడియా సెంటర్. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కంప్యూటర్ టెక్నాలజీని, సింపుల్ టెలివిజన్‌ని ఒకచొట చేర్చడమే. లెనోవా ప్రవేశపెట్టనున్న ఐడియా సెంటర్‌లో టివి తో పాటుగా హై టెక్నాలజీ కంప్యూటర్ సిస్టమ్‌ని కూడా ఇమడింప చేయడం జరిగింది.

కంప్యూటింగ్ చేసుకొవడానికి లెనోవా ఐడియా సెంటర్ బి320 అద్బుతమైన సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో టివి, కంప్యూటర్ రెండింటిని ఇమడింజేయడంతో పాటు దీని ఫెర్పామెన్స్ తగ్గుతుంది అనుకుంటే పొరపాటే. లెనోవా ఐడియా సెంటర్ బి320 స్విచ్ ఆన్ చేయకుండానే టివిగా కూడా ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా కంప్యూటర్‌గా ఉపయోగించుకుంటుంటే టివి చూడాలనిపిస్తే కంప్యూటర్‌ని టర్నఆప్ చేయవలసిన పని కూడా లేదు. లెనోవా ఐడియా సెంటర్ బి320ను అధ్బుతమైన ప్రత్యేకతలు, ఫీచర్స్‌తో రూపొందించడం జరిగింది.

లెనోవా ఐడియా సెంటర్ బి320లో ముఖ్యంగా మనం చెప్పుకొదగ్గ ఫీచర్స్ ఏమిటంటే 21.5 ఇంచ్ పుల్ హెచ్ డి టచ్ స్క్రీన్‌తో పాటు 21 ఇంచ్ స్క్రీన్ టివిని చూసేందుకు వీలుగా రూపోందించడం జరిగింది. కంప్యూటర్‌గా వినియోగించేందుకు గాను ఇందులో హై స్పీడ్ పవర్ పుల్ ప్రాసెసర్‌ని ఇమడింప చేయడం జరిగింది. సాధారణంగా ఇందులో ఉన్న 3 GB DDR3 RAMను అద్బుతంగా పని చేసే 8 GB DDR3 1333MHZ మొమొరీగా విస్తరించడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది.

లెనోవా ఐడియా సెంటర్ బి320లో ఇంకా మనం చెప్పుకొదగ్గ ఫీచర్స్ వన్ కీ టివి ఫంక్షన్‌తో పాటు ఒకే ఒక సింగిల్ క్లిక్‌తో సిస్టమ్ హెచ్‌డి టివి మానేటర్‌గా మారుతుంది. పేసియల్ ట్రాకింగ్, ఇమేజి ఎఫెక్ట్స్‌ని చేసుకునేందుకు గాను ఇందులో లెనోవా హెచ్‌డి వెబ్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు వైర్ లెస్ మౌస్, కీబోర్డ్ ప్రత్యేకం. వీటితో పాటు ప్రత్యేకంగా మైక్రో ఫోన్, హెడ్ ఫోన్, PS2, USB 2.0, USB 3.0 ports, 5 in 1 card reader అదనం. ఇన్న అత్యాధునికమైన ఫీచర్స్ ఉన్న లెనోవా ఐడియా సెంటర్ బి320 ధర ఇండియాలో సుమారుగా రూ 37, 990గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot