మార్కెట్లోకి లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌లు

|

చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో తన ఐడియాప్యాడ్ సిరీస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఐడియాప్యాడ్ 330ఎస్ ఇంకా ఐడియాప్యాడ్ 530ఎస్ మోడల్స్‌లో ఈ అల్ట్రా-సిమ్ ల్యాప్‌‌టాప్స్ అందుబాటులో ఉంటాయి.వీటీలో ఆరంభ మోడల్ అయిన ఐడియాప్యాడ్ 330ఎస్ ధర రూ.35,990 నుంచి ప్రారంభమవుతుంది. హై-ఎండ్ మోడల్‌గా భావిస్తోన్న ఐడియాప్యాడ్ 530ఎస్ ధర రూ.67,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్లీక్ డిజైన్ ల్యాపీలను ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసినట్లు లెనోవో చెబుతోంది. వీటి స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..

 

ఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లుఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లు

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 8 గంటల బ్యాకప్..

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 8 గంటల బ్యాకప్..

ఐడియాప్యాడ్ 530ఎస్ ల్యాప్‌టాప్స్ ఇంటెల్ 8వ తరం ప్రాసెసర్స్ పై రన్ అవుతాయి. ఈ ప్రాసెసర్‌కు అటాచ్ చేసిన ఎన్-విడియా MX 150 జీపీయూ డివైజ్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. వీటిలో 512జీబి వరకు ఎస్ఎస్‌డి స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లలో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ పై రన్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ పై 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ ల్యాప్‌టాప్ ప్రొవైడ్ చేస్తుంది.

రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో..

రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ ల్యాప్‌టాప్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డి హైడెఫినిషన్ డిస్‌ప్లేతోనూ, రెండవ వేరియంట్ 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి హైడెఫినిషన్ డిస్‌ప్లేలతోనూ లభ్యమవుతాయి. ల్యాపీలో నిక్షిప్తం చేసిన హార్మన్ స్పీకర్స్ డాల్బీ ఆడియోను ఉత్పత్తి చేస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్‌లైట్ కీబోర్డ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కొత్త ఫీచర్స్ ఐడియాప్యాడ్ 530ఎస్ ల్యాప్‌టాప్‌లకు ప్రధానమైన హైలైట్స్‌గా నిలుస్తాయి.

ఇక 330ఎస్ మోడల్ విషయానికి వచ్చేసరికి..
 

ఇక 330ఎస్ మోడల్ విషయానికి వచ్చేసరికి..

ఇక 330ఎస్ మోడల్ విషయానికి వచ్చేసరికి ఈ ల్యాప్‌టాప్ కూడా రెండు రకాల డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డి స్ర్కీన్‌తోనూ, రెండవ వేరియంట్ 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి స్ర్కీన్‌తోనూ లభ్యమవుతాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో ఎస్ఎస్‌డి ఇంకా హెచ్‌డిడి స్టోరేజ్‌లను మరింతగా యాడ్ చేసుకునే వీలుంటుంది. బ్యాక్‌లైట్ కీబోర్డ్, 4జీబి డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఇంకా మెటాలిక్ ఫినిష్ వంటి హైలైట్ ఫీచర్స్ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.

బ్యాక్ టు కాలేజ్ ఆఫర్ క్రింద రెండు సంవత్సరాల వారంటీ...

బ్యాక్ టు కాలేజ్ ఆఫర్ క్రింద రెండు సంవత్సరాల వారంటీ...

బ్యాక్ టు కాలేజ్ ఆఫర్ క్రింద లెనోవో ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తోంది. ఈ ఆఫర్ క్రింద ఐడియాప్యాడ్ 530ఎస్, 330ఎస్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే విద్యార్థులకు ఒక సంవత్సరం ప్రీమియమ్ కేర్ వారంటీతో పాటు ఒక సంవత్సరం యాక్సిడెంటల్ డ్యామెజ్ ప్రొటెక్షన్‌ను లెనోవో ప్రొవైడ్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Lenovo has launched its new IdeaPad laptops in India, boosting its portfolio of ‘ultra-slim’ range. The new set of devices include the IdeaPad 330S and the IdeaPad 530S.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X