మార్కెట్లోకి లెనోవో ఐడియాప్యాడ్ ఏ10

Posted By:

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో ‘ఐడియాప్యాడ్ ఏ10' పేరుతో సరికొత్త డ్యుయల్ మోడ్ నోట్‍‌బుక్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత డ్యుయల్-మోడ్ నోట్ బుక్ ధర రూ.19,990.

మార్కెట్లోకి లెనోవో ఐడియాప్యాడ్ ఏ10

పూర్తి సైజ్ కీబోర్డ్ వ్యవస్థను కలిగి ఉండే ఈ డివైజ్ 10.1 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ హైబ్రీడ్ డివైజ్ డిస్‌ప్లే 300 డిగ్రీల కోణంలో ఫ్లిప్ చేసుకోవచ్చు. ఐడియాప్యాడ్ ఏ10 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

ఆండ్రాయిడ్ 4.2 జెల్లబీన్ ఆపరేటంగ్ సిస్టం,
10.1 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
10 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్,
కార్టెక్స్ ఏ9 క్వాడ్‌‍కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్, 32జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
కనెక్టువిటీ ఫీచర్లు (మైక్రోయూఎస్బీ పోర్ట్, 2 మైక్రోయూఎస్బీ 2.0 పోర్టులు, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, టీఎఫ్ మైక్రోఎస్డీ కార్డ్‌రీడర్, ఆడియో కాంబో జాక్),
10 గంటల బ్యాటరీ బ్యాకప్.

ఐడియాప్యాడ్ ఏ10 బరువు 1కిలో గ్రాములు. పరిమాణం 269 x 185 x 17.3మిల్లీమీటర్లు. పూర్తి సైజ్ కీబోర్డ్ వ్యవస్థను కలిగి ఉన్నఈ డ్యుయల్ మోడ్ డివైస్ టైపింగ్‌కు మరింత అనువుగా ఉంటుంది. ఐడియాప్యాడ్ ఏ10ను లెనోవో స్టోర్లు, ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot