లెనోవో టచ్‌స్ర్కీన్ నోట్‌బుక్ ‘ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్ 2’

Posted By:

ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో తన ఐడియాప్యాడ్ సిరీస్ నుంచి ‘ఫ్లెక్స్ 2 ' పేరుతో సరికొత్త డ్యూయల్ మోడ్ మల్టీటచ్ నోట్‌బుక్‌ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.42,250. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాన్ని ల్యాప్‌టాప్ అలానే టచ్‌స్ర్కీన్ మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఆ డివైజ్‌లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే వ్యవస్థ 300 డిగ్రీల తిరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

లెనోవో టచ్‌స్ర్కీన్ నోట్‌బుక్ ‘ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్ 2’

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, నాలుగవ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ( ఐ7 వరకు పొడిగించుకునే సౌలభ్యతతో), 4జీబి ర్యామ్, 2జీబి ఎన్‌విడియా జీఫోర్స్ జీటీ 740ఎమ్ గ్రాఫిక్స్ కార్డ్. 14 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్), AccuType కీబోర్డ్. కనెక్టువిటీ ఫీచర్లు: (వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, కార్డ్‌రీడర్, ఆర్ జే45 ఇతర్‌నెట్ పోర్ట్). 720 పిక్సల్ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరా వ్యవస్థ, 48వాట్ బ్యాటరీ.  నోట్‌బుక్ బరువు 2 కిలోగ్రాములు, మందం 0.23మందం.

ప్రత్యేకమైన ఫీచర్లు:

డాల్బీ అడ్వాన్సుడ్ ఆడియో వ్యవస్థతో కూడిన అనుసంధానిత స్టీరియో స్పీకర్లు, వన్‌కీ రికవరీ, లెనోవో క్లౌడ్ స్టోరేజ్, లెనోవో వాయిస్ కంట్రోల్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot