లెనోవో తాజా అప్‌డేట్ ఏంటి?

Posted By: Super

లెనోవో తాజా అప్‌డేట్ ఏంటి?

ప్రఖ్యాత కంప్యూటింగ్ పరికరాలు తయారీ సంస్థ లెనోవో తాజా అప్‌టేట్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఈ సంస్థ రూపొందించిన టాబ్లెట్ ‘ఐడియాప్యాడ్ కె1’ త్వరలో ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను పులుముకోనుంది. ఈ అప్‌డేట్‌ను స్వీకరించే యూజర్లు ముందస్తుగా తమ పీసీలోని డేటాను బ్యాకప్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్లు మరింత మెరుగైన కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలుగుతారు. అదనంగా జత అయిన టెక్స్ట్ ఇన్‌పుట్, ఫోటో ఎడిటర్, బెటర్ వెబ్‌బ్రౌజింగ్ వంటి అంశాలు కొత్త అనుభూతులకు లోను చేస్తాయి.

లెనోవో ఐడియాప్యాడ్ కె1 ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

మెరుగైన యూజర్ - ఇంటర్ ఫేస్,

10 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆప్షనల్ మెమరీ 16జీబి, 32జీబి,

1జీబి ర్యామ్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

వై-ఫై, బ్లూటూత్,యూఎస్బీ కనెక్టువిటీ,

యాక్సిలరోలమీటర్, డిజిటల్ కంపాస్,

హెచ్‌టీఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్,

7400ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ లితియమ్ బ్యాటరీ.

వైట్, రెడ్, బ్లాక్ ఇంకా బ్రౌన్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న లెనోవో ఐడియాప్యాడ్ కె1 ధర రూ.22,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot