లెనోవో ‘తెరచాటు వ్యూహం’ ఫలిస్తుందా..?

Posted By: Staff

లెనోవో  ‘తెరచాటు వ్యూహం’ ఫలిస్తుందా..?

 

‘కొత్తది వింత..పాతది రోత’అన్న చందాన  పాత తరం కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల పై రోజు రోజుకు మక్కువ తగ్గుతోంది. ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీతో  అల్ర్టాబుక్ అదేవిధంగా టాబ్లెట్  కంప్యూటర్లు ఆవిర్భవించిన నాటి నుంచి నెట్‌బుక్ కంప్యూటర్లకు క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. మరుగున పడిపోతున్న నెట్‌బుక్  కంప్యూటర్‌లను తిరిగి లైన్‌లో పెట్టేందుకు  ‘లెనోవో’ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తుంది.

తమ నెట్‌బుక్‌లకు పూర్వ వైభవాన్ని రప్పించుకునే క్రమంలో  ఈ పటిష్ట బ్రాండ్  తెరచాటు వ్యూహాలను సిద్ధం చేసింది. తాజాగా విడుదల చేస్తున్న ‘న్యూ ఐడియా ప్యాడ్ S110’ నెట్‌బుక్‌లో  వేగవంతమైన పనితీరును ప్రదర్శించే  ‘సిడార్ ట్రెయిల్ ప్రాసెసింగ్ చిప్’ను నిక్షిప్తం చేసింది. ఈ అప్‌డేట్ తమకు కలిసొచ్చే అంశంగా లెనోవో భావిస్తోంది. టాబ్లెట్ పీసీని తలపించే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ బరువు కేవలం 1.15కిలో గ్రాములు.

‘న్యూ ఐడియా ప్యాడ్ S110’ ముఖ్య ఫీచర్లు:

* పటిష్టవంతమైన N2600 సిడార్ ట్రెయిల్ చిప్, * 320జీబి హార్డ్ డిస్క్, * 1జీబి ర్యామ్, *  10.1 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, * 3జీ కనెక్టువిటీ, * 2 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, * సౌకర్యవంతమైన టైపింగ్ కు ఫుల్ సైజ్ చిక్లెట్ కీబోర్డ్, * క్విక్ స్టార్ట్  “instant on” ఆప్షన్, * వీజీఏ పోర్ట్, * ఇండియన్ మార్కెట్లో  న్యూ ఐడియా ప్యాడ్ S110 ధర రూ.20,000 ఉండొచ్చని అంచనా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot