స్టూడెంట్స్ పై కన్నేసిన మోస్ట్ వాంటెడ్..?

Posted By: Staff

స్టూడెంట్స్ పై కన్నేసిన మోస్ట్ వాంటెడ్..?

 

మోస్ట్ వాంటెడ్ ల్యాప్‌టాప్ బ్రాండ్ ‘లెనోవో’ విద్యార్థులకు మరింత చేరువయ్యే పనిలో పడింది. ఈ అంతర్జాతీయ ఉత్పాదక సంస్థ మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా స్టైల్, హుందాతో కూడిన గ్యాడ్జెట్లను డిజైన్ చేస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో లెనోవో ఆవిష్కరించిన ‘ఐడియాప్యాడ్ ఎస్200’ల్యాపీ విశేషంగా ఆకట్టుకుంది. ‘లెనోవో ఐడియాప్యాడ్ ఎస్200’ విద్యార్థులకు ఉత్తమమైన ఎంపిక. మన్నిక, స్టైల్, హుందా, కంఫర్ట్ వంటి మేలైన తత్వాలు ఈ ల్యాపీలో ఒదిగి ఉన్నాయి.

ఐడియా ప్యాడ్ ఫీచర్లు:

* 11.6 అంగుళాల హై డెఫినిషన్ వైడ్ స్ర్కీన్(రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), * మైక్రో సాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం, * 1.86Ghz ఇంటెల్ ఆటమ్ N2800 ప్రాసెసర్, * 32జీబి ఎస్ఎస్డీ డ్రైవ్, * 2 జీబి DDR3 ర్యామ్, * 2 ఇన్ 1 కార్డ్‌రీడర్, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * 0.3 మెగాపిక్సల్ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, * బ్యాటరీ బ్యాకప్ 4 గంటలు.

ఈ డివైజ్‌లో ఏర్పాటు చేసిన 6 సెల్ బ్యాటరీ వ్యవస్థ నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం నాలుగు గంటలు మాత్రమే. ల్యాపీలో లోడ్ చేసిన ఇతర ఫీచర్లన్ని యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు దోహదపడతాయి. క్యాండీ పింక్, క్రిమ్‌సన్ రెడ్, ఎలక్ర్టిక్ బ్లూ, గ్రాఫైట్ గ్రే, పెర్ల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot