భారత్‌లో కొత్త శ్రేణి లెనోవో ల్యాప్‌టాప్స్ (వీటిలో దమ్ముంది గురూ!)

Posted By: Staff

భారత్‌లో కొత్త శ్రేణి లెనోవో ల్యాప్‌టాప్స్ (వీటిలో దమ్ముంది గురూ!)

 

లెనోవో ల్యాప్‌టాప్‌లను ఆరాధించే తెలుగు  టెక్నాలజీ ప్రియులకు శుభవార. ఐఎఫ్ఏ 2012, బెర్లిన్ ఎగ్జిబిషన్ వేదికగా లెనోవో ప్రకటించిన ఐడియా ప్యాడ్ ఎస్300, ఎస్400 ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు భారత్ రిటైల్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దేశీయంగా వీటి ధరలను పరిశీలిస్తే లెనోవో ఐడియాప్యాడ్ ఎస్300 ధర రూ.29,990, ఎస్400 ధర రూ.30,990గా ఉంది. ఈ కంప్యూటింగ్ డివైజ్ లు 21.8మిల్లీమీటర్ల మందాన్ని కలిగి  1.8 కిలోగ్రాములు బరువును సంతరించుకున్నాయి. ఇంటర్నెల్ మెమెరీ సామర్ధ్యం 500జీబి. క్రిమ్సన్ రెడ్, సిల్వర్ గ్రే, కాంట్ క్యాండీ పింక్ కలర్ వేరియంట్‌లలో ఈ ల్యాపీలు రూపుదిద్దుకున్నాయి. క్విక్ స్టార్ట్, డైరెక్ట్ షేర్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి  ప్రత్యేక ఫీచర్లను ఈ పరికారాల్లో ముందస్తుగా ఇన్స్‌స్టాల్ చేసారు. ప్రస్తుతానికి ఈ ల్యాపీలు విండోస్ 7 పై రన్ అవుతాయి. త్వరలో వీటిని విండోస్8కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఔత్సాహికులు ఈ ల్యాప్‌టాప్‌లను లెనోవో ప్రత్యేక స్టోర్స్ లేదా ప్రముఖ మల్టీ బ్రాండ్ స్టోర్‌ల వద్ద  కొనుగోలు చేయవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting