లెనోవో ‘ఐడియా ప్యాడ్’ధర తక్కువ..ఫీచర్లెక్కువ..!!

Posted By: Staff

లెనోవో ‘ఐడియా ప్యాడ్’ధర తక్కువ..ఫీచర్లెక్కువ..!!

ప్రకటన వెలువడిందో లేదా.. అంచనాలు ఊపందుకున్నాయి.., ముహుర్తం దగ్గర పడుతున్న కొద్ది.. వినియోగదారుల్లో తహ తహ మొదలైంది. చైనా సాంకేతిక పరికరాలు తయారీదారు ‘లెనోవో’అత్యాధునిక ఫీచర్లతో డిజైన చేయబడని ‘ఏ1’టాబ్లెట్ పరికిరాన్ని తక్కువ ధరకే ఈ నవంబర్ లో విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తుంది.

కంప్యూటర్లు మరియు ఎలక్ట్ర్రానిక్ పరికరాల తయారీ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న‘లెనోవో’వినియోగదారులకు మరింత చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన సాంకేతిక వస్తువులు సమజంసమైన ధరలకే అందించేందుకు యత్నాలు ప్రారంభించింది. తాజాగా ‘టాబ్లెట్ పీసీ సెక్టార్ లోకి ప్రవేశించిన ‘లెనోవో’మార్కెట్ ను వసం చేసుకునే ప్రణాళికను రూపొందించింది. బ్రాండ్ నవంబర్ లో విడుదల చేయుబోతున్న ‘లెనోవో ఐడియా ప్యాడ్ A1’ పై ఇప్పటికే మార్కెట్లో అంచనాలు జోరందుకున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ కేవలం రూ. 8,000కే లభ్యకానుంది.

క్లుప్తంగా ‘లెనోవో ఐడియా ప్యాడ్ A1’ ఫీచర్లు :

- టాబ్లట్ లో లోడ్ చేసిన గూగుల్ ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్థను వినియోగదారుడికి మరింత యూజర్ ఫ్రెండ్లీగా సహకరిస్తుంది.
- బ్యాటరీతో కలుపుకుని టాబ్లెట్ బరువు కేవలం 400గ్రాములు మాత్రమే.
- శక్తివంతమైన OMAP 3622 ప్రొసెసింగ్ వ్యవస్థ మన్నికైన పనితీరును అందిస్తుంది.
-512MB ర్యామ్ సామర్ధ్యం పటిష్ట స్టోరేజి వ్యవస్థను కలిగి ఉంటుంది.
- 7 అంగుళాల డిస్ ప్లే 1024*600 పిక్సల్ రసల్యూషన్ కలిగి ఉంటుంది.
- మల్టీ టచ్ స్ర్కీన్ వ్యవస్థ టాబ్లెట్ పీసీ ప్రత్యేక ఆకర్షణ.
- మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ సౌలభ్యంతో మెమరీని రెట్టింపు చేసుకోవచ్చు.
- పీసీలో పొందుపరిచిన బ్లూటూత్, వై-ఫై కెనెక్టువిటీ వ్యవస్థలు సమాచారాన్ని మరింత వేగవంతంగా చేరుస్తాయి.
- నావిగేషన్ ప్రక్రియకు ఉపయోగపడే విధంగా, జీపీఎస్ కనెక్టువిటీ వ్యవస్థను పీసీలో పొందుపరచవచ్చని తెలుస్తోంది.
- టాబ్లెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 3.1, వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగా పిక్సల్ కెమెరాలు నాణ్యమైన వీడియో ఛాటింగ్ కు ఉపకరిస్తాయి. అంతేకాకుండా నాణ్యమైన ఫోటోలను

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot