లెనోవో ఐడియా ప్యాడ్ మీకు సరితూగుతుందా..?

Posted By: Prashanth

లెనోవో ఐడియా ప్యాడ్ మీకు సరితూగుతుందా..?

 

లెనోవో ఐడియా ప్యాడ్ U300 వర్షన్‌ను అప్‌డేట్ చేస్తూ ఐడియా ప్యాడ్ U400 మార్కెట్లో విడుదలయ్యింది. హై ఎండ్ స్పెసిఫికేషన్లతో ‘లెనోవో’ ఈ ల్యాపీలను డిజైన్ చేసింది. సౌకర్యవంతంగా ఎక్కడికైనా క్యారీ చేసేందుకు ఈ అల్ట్రాబుక్ దోహదపడుతుంది. మన్నికైన ఆల్యూమినియమ్ పదార్ధాన్ని గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు. డార్క్ గ్రే కలర్ లుక్ చూపరులను కట్టిపడేస్తుంది. పవర్ బటన్ మెటల్ ఫినిషింగ్‌తో డిజైన్ చేశారు. కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టం చేస్తూ హెచ్డీఎమ్ఐ (HDMI) మరియు ఆడియో పోర్టులను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు. కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది.

వివిధ కాన్పిగరేషన్లలో ఈ అల్ర్టాబుక్స్ లభ్యమవుతున్నాయి. వినియోగదారుడు తన అవసరాన్ని బట్టి i3, i5 లేదా i7 ప్రాసెసింగ్ వ్యవస్థలను ఎంపిక చేసుకోవచ్చు. ర్యామ్‌ను 8 జీబికి వరకు వృద్థి చేసుకోవచ్చు. అదే విధంగా హార్డ్ డిస్క్ జీబిని 1 ట్యాబ్

వరకు పెంచుకోవచ్చు. ధర.40,000 కాన్పిగరేషన్ మార్పులను బట్టి ధరలో వత్యాసం ఉంటుంది. నూటికి నూరు శాతం మన్నికను కోరుకునే వారికి ఈ అల్ర్టాబుక్ తప్పక సరితూగుతుంది.

క్లుప్తంగా ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు:

*14 అంగుళాల స్ర్కీన్ సైజు, డిస్ ప్లే రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్, బరువు 1.98 కిలో గ్రాములు, ల్యాపీ మందం 22.6 mm, కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టతం చేస్తూ యూఎస్బీ 2.0, 3.0 పోర్ట్స్, ఇతర్ నెట్ పోర్ట్, 1.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, ఇంటెల్ వైర్ లెస్ డిస్ ప్లే, ట్విన్ స్పీకర్స్, ఇంటెల్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, 6 జీబి ర్యామ్ (అప్ గ్రేడబుల్), 750 జీబి హార్డ్ డిస్క్ (అప్ గ్రేడబుల్), 1జీబి వీడియో మెమరీ, 4 సెల్ 54 Wh బ్యాటరీ సామర్ధ్యం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot