గూగుల్.. లెనోవోల మధ్య టాబ్లెట్ యుద్ధం!

Posted By: Prashanth

గూగుల్.. లెనోవోల మధ్య టాబ్లెట్ యుద్ధం!

 

టాబ్లెట్ కంప్యూటర్‌ల ప్రపంచానికి ఐప్యాడ్‌ను పరిచయం చేసిన ఆపిల్ నాటి నుంచి నేటి వరకు ఆ విభాగంలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆపిల్ గట్టిపోటీని ఎదుర్కోవల్సి ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. ఆపిల్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నంగా సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా విడుదల చేసిన నెక్సస్ 7 టాబ్లెట్ విశ్లేషకుల ప్రశంసలను సైతం అందుకుని టాబ్లెట్ పీసీల మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరో వైపు ఐఎఫ్ఏ 2012, గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్ వేదికగా ప్రపంచపు రెండవ అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో, ఐడియా ట్యాబ్ ఏ2109 పేరుతో ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. ఈ నేపధ్యంలో గగూల్ నెక్సస్ 7, లెనోవో ఐడియా ట్యాబ్ ల మధ్య ఫీచర్ల వృత్యాసాన్ని పరిశీలిద్దాం...

డిస్‌ప్లే, చుట్టుకొలతలు :

గూగుల్ నెక్సస్ 7: 7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఫోన్ చుట్టుకొలత 198.5 x 120 x 10.5మిల్లీమీటర్లు, బరువు 340 గ్రాములు.

ఐడియా ట్యాబ్ ఏ2109: 9 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, ఫోన్ చుట్టుకొలత 193 x 122 x 13మిల్లీమీటర్లు, బరువు 600 గ్రాములు.

ప్రాసెసర్:

నెక్సస్ 7: ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్, క్వాడ్ కోర్ 1.3గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్‌పీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఐడియాట్యాబ్ ఏ2109: : ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్, క్వాడ్‌కోర్ 1.2 మెగాహెర్జ్ ప్రాసెసర్, యూఎల్‌పీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఆపరేటింగ్ సిస్టం:

గూగుల్ నెక్సస్ 7: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఐడియా ట్యాబ్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

గూగుల్ నెక్సస్ 7: 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( వీడియో కాలింగ్ ఇంకా 720 పిక్సల్ వీడియో రికార్డింగ్),

ఐడియా ట్యాబ్: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పికల్స్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్:

గూగుల్ నెక్సస్ 7: 8జీబి, 16జీబి మెమరీ వేరియంట్స్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

ఐడియా ట్యాబ్: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

గూగుల్ నెక్సస్ 7: బ్లూటూత్, వై-ఫై 802.11 b/g/n, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ ఫీచర్.

ఐడియా ట్యాబ్ ఏ2109: బ్లూటూత్, వై-ఫై 802.11 b/g/n, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

బ్యాటరీ:

గూగుల్ నెక్సస్ 7: 4,325 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్ బై 300 గంటలు),

ఐడియా ట్యాబ్ ఏ2109: తెలియాల్సి ఉంది.

ధరలు:

గూగుల్ నెక్సస్ 7: ధర రూ.17,000,

ఐడియా ట్యాబ్ ఏ2109: ధర రూ.16,500.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot