లెనోవో నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్!

Posted By: Prashanth

లెనోవో నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్!

 

బెర్లిన్ ఎలక్ట్రానిక్ షో అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకుంటన్న తరుణంలో ప్రపంచపు రెండవ అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో ఐఎఫ్ఏ-2012లో భాగంగా మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించింది. వీటిలో ఒకటైన్ లోనోవో ఐడియా ట్యాబ్ ఎస్2110ను టాబ్లెట్ అదేవిధంగా నోట్‌బుక్‌లా ఉపయోగించుకోవచ్చు. మరో రెండు టాబ్లెట్‌లు ఐడియా ట్యాబ్ ఏ2109, ఐడియా ట్యాబ్ ఏ2107 మోడళ్లు ఆధునిక ఫీచర్లను ఒదిగి ఉన్నాయి.

ఐడియా ట్యాబ్ ఎస్2110:

10.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

టచ్ స్ర్కీన్,

కీబోర్డ్ డాక్,

క్వాల్కమ్ 8060A/8260A 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై, బ్లూటూత్,

మెమరీ కాన్ఫిగరేషన్ 16జీబి, 32జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

ఐడియా ట్యాబ్ ఏ2109:

9 అంగుళాల స్ర్కీన్(రిసల్యూషన్ 1280 x 800రిసల్యూషన్),

1.2గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ టెగ్రా 3 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రో హెచ్‌డిఎమ్ఐ అవుట్,

ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా.

ఐడియా ట్యాబ్ ఏ2107:

ఈ టాబ్లెట్ గూగుల్ నెక్సస్ 7కు ప్రత్యక్ష ఫోటోదారు కానుంది. 7 అంగుళా స్ర్కీన్, ఎమ్‌టీకె కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 16జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, 16జీబి ఇన్‌బుల్ట్ మెమరీ కార్డ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, బుల్ట్‌ఇన్ ఎఫ్ఎమ్ రేడియో ట్యూనర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot