లెనోవో 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్‌ల తయారీ కంపెనీ లెనోవో 'ఏ7-30' పేరుతో సరికొత్త 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. amazon.in, snapdeal.comలు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విక్రయిస్తున్నాయి.
లెనోవో 'ఏ7-30' 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్), 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, టాబ్లెట్ బరువు 327 గ్రాములు. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, డాల్బీ ఆడియో వ్యవస్థ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








