లెనోవో నుంచి కొత్త శ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

|

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో ఇండియన్ మార్కెట్లో తన జోరును కొనసాగిస్తూనే ఉంది. కొద్ది రోజల క్రితం లెనోవో ఏ7-30 పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసిన కంపెనీ తాజాగా రెండు కొత్త శ్రేణి కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌లతో పాటు 3 ల్యాప్‌టాప్‌లు అలానే ఓ ఆల్ ఇన్ వన్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది.

 
 లెనోవో నుంచి కొత్త శ్రేణి హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లు

లెనోవో విడుదల చేసిన సరికొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులకు సంబంధించి మోడల్ నెంబర్‌లను పరిశీలించినట్లయితే.. విడుదలైన రెండు కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌లు యోగా 2, ఫ్లెక్స్ 2 మోడల్స్‌గా మార్కెట్లో లభ్యంకానున్నాయి. జీ40, జీ50, జెడ్50 మోడల్స్‌లో ల్యాప్‌టాప్‌లు, సీ260 మోడల్‌లో ఆల్ ఇన్ వన్ పీసీ లభ్యంకానుంది. వీటి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

లెనోవో యోగా 2:

ఈ కన్వర్టబుల్ హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైస్‌ను ల్యాప్‌టాప్ అలానే ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.59,900. ఫీచర్లను పరిశీలించినట్లయితే... 10 పాయింట్ మల్టీ-టచ్ వ్యవస్థ, 13.3 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ వైడ్-వ్యూ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920x1080పిక్సల్స్), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ, ర్యామ్ (8జీబి వరకు).

లెనోవో ఫ్లెక్స్ 2:

ఈ కన్వర్టబుల్ హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైస్‌ను ల్యాప్‌టాప్ అలానే ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.41,990. 15 అంగుళాల డిస్‌ప్లే, సమర్థవంతమైన బ్యాక్‌లైట్ కీబోర్డ్, గ్రాఫైట్ గ్రే కలర్‌లో ఈ ల్యాపీ లభ్యమవుతోంది.

లెనోవో జీ40, జీ500

తక్కువ బరువును కలిగి ఉండే ఈ పలుచటి శ్రేణి ల్యాప్‌టాప్‌లు GIGALAN సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. శక్తివంతమైన ఏఎమ్‌డి ప్రాసెసర్‌‍లను ఈ ల్యాపీలలో అమర్చారు. డాల్బీ అడ్వాన్స్ ఆడియో, డీవీడీ డ్రైవ్ వంటి ఫీచర్లను ఈ కంప్యూటింగ్ డివైస్‌లలో ఏర్పాటు చేసారు. ధర రూ.22,990.

లెనోవో జెడ్50:

ఈ మల్టీమీడియా నోట్‌బుక్ 15.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆక్యూటైప్ కీబోర్డ్, డాల్బీ అడ్వాన్స్ ఆడియో ఫీచర్, మార్కెట్ ధర రూ.39,990.

సీ260 ఆల్ ఇన్ వన్ పీసీ

19.5 అంగుళాల స్ర్కీన్‌ను ఈ ఆల్ ఇన్ వన్ పీసీ కలిగి ఉంటుంది. టచ్ స్ర్కీన్ సామర్థ్యం, ధర రూ.28,490.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X