లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్, రూ.20,490కే

ఐడియాప్యాడ్ 110 (ideapad 110) పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను లెనోవో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కన్స్యూమర్ ల్యాప్‌టాప్ ప్రారంభ వేరియంట్ ధర రూ.20,490.

లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్, రూ.20,490కే

Read More : అమెరికాలో సాఫ్ట్‌వేర్ జీతాలు ఎలా ఉన్నాయ్..?

ఉచిత యాక్సిడెంటల్ డామెజ్ ప్రొటెక్షన్ సౌకర్యంతో వస్తోన్న ఈ ల్యాపీలో ఇంటెల్ పెంటియమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కాన్ఫిగర్ చేసారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్, రూ.20,490కే

డివైస్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 15.6 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), 4జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1TB స్టోరేజ్, బ్లుటూత్, వై-ఫై, DVD/CD-RW డ్రైవ్, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ.

Read More : NASA ఆ రహస్యాన్ని దాస్తోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెస్క్‌టాప్‌లతో పోలిస్తే ల్యాప్‌టాప్‌ల వినియోగం


డెస్క్‌టాప్‌లతో పోలిస్తే ల్యాప్‌టాప్‌ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను మరింత చిన్నవిగా మార్చే క్రమంలో వీటి కూలింగ్ వ్యవస్థ మరింత చిన్నదిగా అయిపోతోంది. పర్యావసానంగా ఆధునిక ల్యాప్‌టాప్‌లను ఓవర్ హీటింగ్ సమస్య బెంబేలెత్తిస్తోంది. ఇందుకు కారణం ఈ ల్యాపీలలో కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే....

రాగి నాణేలు

ల్యాపీ పై రాగి నాణేలు ఉంచటం ద్వారా అవి రేడియోటర్‌లా పనిచేసి వేడిని లాగేసుకుంటాయట.

బోలెడన్ని రాగి నాణేలు అవసరమవుతాయి

ఈ ఆలోచన కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఫలితం మాత్రం ఆశాజనకంగా ఉంటుందట. ఈ ట్రిక్‌ను అప్లై చేయాలంటే మీకు బోలెడన్ని రాగి నాణేలు అవసరమవుతాయి. వాటిని సేకరించే పనిలో నిమగ్నమవ్వండి మరి!.

మరో ల్యాప్‌టాప్‌తో కంపేర్ చూసి చూడలేం

ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ అయ్యే వేడితో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వేడి ఉష్ణోగ్రతల కారణంగా తెలత్తవచ్చు.

ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం

మీరు ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది.

కూల్‌గా ఉండాలంటే

మీ ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా మొత్తటి దుస్తును వాడండి.

ప్రత్యేకమైన స్టాండ్స్

ల్యాప్‌టాప్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్ల బరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మీ ల్యాప్‌టాప్‌లో పరిమితికి మించిన సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయా..? మీ డివైస్ హీట్ అవటానికి ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కాబట్టి వెంటనే వీటిని తొలగించండి.

నిరంతరం కూల్‌గా ఉంచేందుకు

మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo launches ideapad 110 laptop for first-time buyers. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting