లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్ ‘థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్’

Posted By: Super

లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్  ‘థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్’

 

 

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ లెనోవో తన థింక్ ప్యాండ్ సిరీస్ నుంచి సరికొత్త శ్రేణి ల్యాప్‌టాప్  ‘ఎక్స్1 కార్బన్’ను సోమవారం ముంబైలో ఆవిష్కరించింది. ధర రూ.85,000. ఈ సందర్భంగా  లెనోవో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  అమర్ బాబు మాట్లుడుతూ ‘థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్’ ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి  బిజినెస్ అల్ట్రాబుక్ అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా థింక్ సిరీస్ ఎక్స్‌క్లూజివ్ రిటైల్ అవుట్‌లెట్లు  ప్రస్తుతానికి రెండు ఉండగా వీటి సంఖ్యను తర్వలోనే 30కి పెంచనున్నట్లు  వెల్లడించారు.

ఫీచర్లు:

తక్కువ బరువు కేవలం  1.36 కిలోగ్రాములు, ,

14 అంగుళాల హైడెఫినిషన్  స్ర్కీన్,

బ్యాటరీ బ్యాకప్ 6.3 గంటలు,

ఈఈ3 విత్ రాపిడ్ డ్రైవ్, రాపిడ్ కనెక్ట్ ఫీచర్,

ఇంటెల్ కోర్ 3వ జనరేషన్ ప్రాసెసర్,

ఇంటెల్ టర్బో బూస్ట్ 2.0, రాపిడ్ రెస్యూమ్, రాపిడ్ కనెక్ట్ టెక్నాలజీ,

విండోస్ 7 ఆపరేటిగ్ సిస్టం,

మల్టీ గెస్ట్యుర్  గ్లాస్ సర్‌ఫేస్ టచ్‌ప్యాడ్,

హైడెఫినిషన్ ఫేస్ ట్రాకింగ్ కెమెరా,

డ్యూయల్ యరే మైక్రోఫోన్స్,

డాల్బీ ట్యూనుడ్ ఆడియో.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot