పటిష్ట లైనప్‌తో ‘లెనోవో S2010’!!!

Posted By: Prashanth

పటిష్ట లైనప్‌తో ‘లెనోవో S2010’!!!

 

ఆకట్టుకునే అంశాలతో ‘లెనోవో’(Lenovo) మరో మారు ముందుకు రాబోతుంది. కంప్యూటింగ్ పరికరాల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను సంపాదించుకున్నఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ టాబ్లెట్ కంప్యూటర్ల పరిశ్రమను శాసించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వ్యూహాత్మక కార్యచరణలో భాగంగా బలోపేతమైన ఫీచర్లతో ‘లీప్యాడ్ S2010’ టాబ్లెట్ కంప్యూటర్‌ను తాజాగా లెనోవో డిజైన్ చేసింది.

‘లెనోవో S2010’ కీలక ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ స్రాప్ డ్రాగన్ APQ8060 ప్రాసెసర్, * క్లాక్ స్పీడ్ 1500 MHz, * సిస్టం మెమరీ 1జీబి, * స్టోరేజి మెమరీ 15జీబి, * స్ర్కీన్ సైజు 10.1 అంగుళాలు, * మల్టీ టచ్ సపోర్ట్ డిస్‌ప్లే, * 8 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, * 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, * వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌ను అందించేందుకు గాను జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్‌ఎస్‌డీపీఏ వ్యవస్థలు, * యూఎస్బీ 2.0 మైక్రో యూఎస్బీ కనెక్టర్, * బ్లూటూత్ 2.1, * 802.11 b/g/n వైర్ లెస్ ల్యాన్, * జీపీఎస్ సపోర్ట్.

షైనీ బ్లాక్ కలర్ ఫినిష్‌తో డిజైన్ కాబడిన డివైజ్ ప్రొఫెష్‌నల్ లుక్‌ను సంతరించుకుంటుంది. బరువు కేవలం 670 గ్రాములు ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఉంటుంది. గ్యాడ్జెట్ వాయిస్ సపోర్ట్ అప్లికేషన్‌ను కలిగి ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి జీఎస్ఎమ్, యూఎమ్‌టీఎస్ నెట్‌వర్క్‌లకు సహకరిస్తుంది.

మల్టీ టచ్ కమాండ్‌లను స్ర్కీన్ అంగీకరిస్తుంది. ఈ సౌలభ్యతతో ఫోటోలు అదేవిధంగా వెబ్ పేజీలను సులువుగా జూమ్ లేదా స్ర్కోల్ చేసుకోవచ్చు. డివైజ్‌లో పొందుపరిచిన కనెక్టువిటీ వ్యవస్థలు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫరింగ్‌కు దోహదపడతాయి. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting