78 వేల Lenovo ల్యాపీలు రీకాల్, లిస్ట్‌లో మీ ల్యాపీ ఉందా, చెక్ చేయండిలా..

Written By:

ఇంటర్నెట్ అమితమైన వేగంతో ముందుకు దూసుకెళుతున్న నేటి తరుణంలో అంతే వేగంతో గాడ్జెట్లు కూడా మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, ల్యాపీ, కంప్యూటర్..ఇంకా ఎన్నో రకాలైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సురక్షితమేనా అనే దానికి సమాధానం దొరకదు. ప్రధానంగా పేళ్లుళ్ల సమస్యలు వీటిని వేధిస్తున్నాయి. ప్రధానంగా మొబైల్స్ బ్యాటరీలు ఈ మధ్య ఎక్కడ చూసినా పేలిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వరసలో ల్యాపీలు కూడా చేరాయి. లెనోవో ల్యాపీలు పేలిపోతున్నాయంటూ కంపెనీ కొన్ని ల్యాపీలను రీకాల్ చేస్తోంది.

చైనా నుంచే వరల్డ్ ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్, వేగం తెలిస్తే షాకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేళుల్ల కారణాలతో..

పేళుల్ల కారణాలతో ప్రముఖ చైనీస్ తయారీ దిగ్గజం లెనోవో భారీ మొత్తంలో ల్యాప్‌టాప్‌లను రీకాల్‌ చేసింది. ఇవి వాడటం వెంటనే ఆపేయాలంటూ వినియోగదారులకు పిలుపునిచ్చింది.

థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌లను రీకాల్‌..

కాగా థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌లను రీకాల్‌ చేసినట్టు లెనోవో ప్రకటించింది. 78వేల యూనిట్ల థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ ఐదో జనరేషన్‌ ల్యాప్‌టాప్‌లను కంపెనీ రీకాల్‌ చేసినట్టు అమెరికాలోని కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ కూడా వెల్లడించింది.

మొత్తం 78వేల యూనిట్ల రీకాల్

ఓవర్‌హీట్‌తో బ్యాటరీలు పాడైపోతున్నాయని, దీంతో పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయని, వెంటనే ఈ బ్యాటరీలను రీఫైర్‌ చేయాల్సి ఉందని కంపెనీ తెలిపింది. మొత్తం 78వేల యూనిట్ల రీకాల్‌లో 5,500 యూనిట్ల రీకాల్‌ కెనడాలోనే జరిగింది. మిగతా ల్యాపీల రీకాల్ యుఎస్‌లో జరిగింది.

2016 డిసెంబర్‌ నుంచి 2017 డిసెంబర్‌ మధ్యలో..

కాగా లెనోవో థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ ల్యాప్‌టాప్‌ ఐదవ జనరేషన్‌కు చెందింది. ఇది సిల్వర్‌, బ్లాక్‌ రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చింది. రీకాల్‌ చేసిన ఈ 78వేల యూనిట్ల ల్యాప్‌టాప్‌లు 2016 డిసెంబర్‌ నుంచి 2017 డిసెంబర్‌ మధ్యలో తయారుచేశారు.

లింక్‌

థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ 5వ తరం యూజర్లు వెంటనే https://support.lenovo.com/X1C_5GEN_RECALL లింక్‌ను క్లిక్‌ చేసి, తమ ల్యాప్‌టాప్‌లు రీకాల్‌ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. ఒకవేళ ఈ జాబితాలో యూజర్ల ల్యాప్‌టాప్‌ ఉంటే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని హెచ్చరించింది.

6వ జనరేషన్

కాగా కంపెనీ ఈ మధ్యనే 6వ జనరేషన్ ThinkPad X1 Carbonని లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత lightest 14-Inch business laptop. ఈ ల్యాపీ పాత జనరేషన్‌లోని కొద్ది అప్‌గ్రేడ్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Recalls Some ThinkPad X1 Carbon Laptops Over Potential Fire Hazard More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot