లెనోవో ఎస్5000@రూ.10,999

Posted By:

ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ ట్రేడ్ షోలో లెనోవో ఆవిష్కరించిన క్వాడ్‌కోర్ పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్ ‘ఎస్5000' ఎట్టకేలకు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ ఉపయుక్తమైన కంప్యూటింగ్ డివైస్‌ను రూ.10,999కి విక్రయిస్తోంది.డివైస్ ప్రత్యేకతలు...

లెనోవో ఎస్5000@రూ.10,999

లెనోవో ఎస్5000 టాబ్లెట్ 7 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెరతో కూడిన ఐపీఎస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 800పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్), 3450 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ పాలిమర్ బ్యాటరీ. టాబ్లెట్ బరువు 246 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot