Home
Computer

లెనోవో సోలార్ యోగా ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్యా.. ఇక సూర్యుడే ఛార్జర్..!

Lenovo Solar-Powered Yoga: లెనోవో కంపెనీ ఒక సంచలనానికి తెరలేపింది. యోగా సిరీస్‌లో అదిరిపోయే సోలార్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఈ అల్ట్రాబుక్ స్క్రీన్ వెనుక సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఇది సూర్యుడి వెలుగుని పట్టుకుని విద్యుత్‌గా మార్చి బ్యాటరీని నింపుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. జస్ట్ 20 నిమిషాలు ఎండలో పెడితే చాలు.. గంట పాటు ఛార్జింగ్ వస్తుందంట. మామూలు ఛార్జర్‌తో కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు.

కానీ కరెంట్ లేకపోతే మామూలు ల్యాప్‌టాప్‌ చాట్ చేయడం కుదరదు కానీ యోగా ల్యాప్‌టాప్‌ను సోలార్ ఫీచర్‌తో రాత్రిపూట తప్ప ఎప్పుడంటే అప్పుడు చాట్ చేసుకోవచ్చు. పవర్ ప్రాబ్లమ్ ఉండనే ఉండదు. ఐడియా వినడానికి సింపుల్‌గానే ఉంద కానీ దీన్ని నిజం చేయాలనే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు.

Lenovo Solar-Powered Yoga Laptop Concept Is So Brilliant  It   s Shocking No One Did It Sooner

సోలార్ పవర్ డివైజ్‌లు ఎప్పటినుంచో ఉన్నా.. లెనోవో యోగా సోలార్ పీసీ మాత్రం సోలార్ ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఫస్ట్ అల్ట్రాబుక్ అని చెప్పొచ్చు. మరి ఇదెలా పనిచేస్తుంది, ఎందుకింత స్పెషలో వివరంగా తెలుసుకుందాం పదండి.

* మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్

ఈ ల్యాప్‌టాప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. సోలార్ ప్యానెల్‌ను ల్యాప్‌టాప్‌లో కలిసిపోయేలా డిజైన్ చేశారు. అందుకే ఇది మిగతా యోగా మోడల్స్‌లాగే సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీలో ఇది టాప్ క్లాస్ అంట. ఎనర్జీని 24% కంటే ఎక్కువ మార్చేస్తుందట. ఇందులో డైనమిక్ సోలార్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఉంది.

ఇది పవర్ వాడకాన్ని గమనిస్తూ బ్యాటరీ లైఫ్‌ని పెంచుతుంది. అంటే సోలార్ పవర్‌తో వాడుతున్నా కూడా.. ఈ ల్యాప్‌టాప్ పవర్‌ని చాలా బాగా మేనేజ్ చేస్తుంది. యూజర్లు దీన్ని సింపుల్‌గా కిటికీ దగ్గరో లేకపోతే బాగా వెలుతురు వచ్చే చోటో పెట్టేస్తే చాలు.. దానంతట అదే ఛార్జ్ చేసుకుంటుంది.

* పర్యావరణానికి మేలు

పర్యావరణాన్ని కాపాడే ఇంజనీరింగ్‌లో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి. మామూలుగా సోలార్ సెటప్‌లు అంటే.. పెద్ద సోలార్ ప్యానెల్స్, పవర్ బ్యాంకులు అన్నీ కావాలి. కానీ లెనోవో డిజైన్ మాత్రం అన్నీ కలిపి ఒకే దాంట్లో వచ్చేలా చేసింది. దీనివల్ల కరెంట్ ఛార్జింగ్ మీద ఆధారపడటం తగ్గుతుంది.

అంతేకాదు.. కార్బన్ విడుదల కూడా తగ్గుతుంది. ఒకవేళ ఇది నిజంగా మార్కెట్‌లోకి వస్తే.. టూర్లు వెళ్లేవాళ్లకి, ఔట్‌డోర్స్‌లో పనిచేసేవాళ్లకి, ఛార్జర్ మర్చిపోయేవాళ్లకి మాత్రం ఇది నిజంగా ఒక వరంలాంటిది. వారు ఛార్జర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఏమో దీనివల్ల వాటిని మోసే భారం తగ్గుతుంది.

* కొన్ని చిక్కులు, ఇబ్బందులు

ఇన్ని లాభాలు ఉన్నా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ అంటేనే సున్నితంగా ఉంటాయి. ఒకవేళ పాడైపోతే మార్చడం కష్టం, ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. ఇంకోటి ఏంటంటే.. ఎలక్ట్రానిక్ వస్తువులు వేడికి పాడైపోయే ఛాన్స్ ఉంది. కానీ లెనోవో వాళ్లు దీన్ని బాగా వెలుతురులో గంటల తరబడి పెట్టి చూశారంట.

వెనకాల ప్యానెల్ కొంచెం వేడెక్కినా, ల్యాప్‌టాప్ మాత్రం కూల్‌గానే ఉందట. ఇంకా రేటు కూడా ఒక సమస్యే. యోగా ల్యాప్‌టాప్స్ అంటేనే కాస్ట్లీ ఉంటాయి. దీనికి సోలార్ ప్యానెల్ కూడా తగిలిస్తే ఇంకా రేటు పెరిగిపోతుంది. ప్రస్తుతానికి యోగా సోలార్ పీసీ ఒక కాన్సెప్ట్ మాత్రమే. కానీ ఇది నిజంగా వాడేలానే ఉంది.

ఒకవేళ లెనోవో వాళ్లు గట్టిదనం విషయంలో శ్రద్ధ పెట్టి, రేటుని అందుబాటులో ఉంచగలిగితే మాత్రం.. ఇది ఒక పెద్ద సంచలనం అవుతుంది. సూర్యరశ్మితో ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తే.. జనాలు పోర్టబుల్ డివైజ్‌లను వాడే విధానమే మారిపోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo's Yoga Solar PC concept integrates a solar panel for sunlight charging. Eco-friendly, it offers portable, sustainable power, addressing charger dependence. Challenges include durability and cost, but it's a promising innovation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X