పరిశ్రమల అవసరాలకు మాది మన్నికైన గ్యాడ్జెట్: లెనోవో

Posted By: Staff

పరిశ్రమల అవసరాలకు మాది మన్నికైన గ్యాడ్జెట్: లెనోవో

వారి టార్గెట్ ‘మల్టీ నేషనల్ కెంపెనీ’లను తమ వైపుకు తిప్పుకోవటమే..?, వారి లక్ష్యం ‘బిజినెస్ ప్రొఫెషనల్స్’ రూటు మళ్లించటమే..?, ఈ ఆపరేషన్ కధాంశం ఏంటి..?, వెనుకున్న సూత్రధారి ఎవరు....

సాంకేతిక ప్రేమికులకు సుపరిచితమైన ‘లెనోవో’ కంప్యూంటింగ్ పరిశ్రమలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఉన్నత ప్రమాణాలతో విశ్వసనీయ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న ఈ అంతర్జాతీయ దిగ్గజం పర్సనల్ కంప్యూటర్ల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటనలను వెలువరించింది.

‘లెనోవో ధింక్ సెంటర్’ వర్షన్లో 4 వేరియంట్లలో పర్సనల్ కంప్యూటర్లను విడుదల చేసేందుకు బ్రాండ్ కసరత్తులు చేస్తుంది. M71Z, M71e, M77, X121e (నోట్ బుక్) వర్షన్లలో ఈ గ్యాడ్జెట్లు రూపుదిద్దుకున్నాయి.

మొదటిగా ‘M71Z’ పీసీ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇంటెల్ కోర్ i3-2100 ప్రాసెసర్, విండోస్ - 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్, 20 అంగుళాల డిస్ ప్లే, 2GB PC3-10600 DDR3 SD ర్యామ్, 500 హార్ఢ్ డ్రైవ్, వేగవంతమైన బూటింగ్ సామర్ధ్యం వంటి అంశాలను పీసీలో నిక్షిప్తం చేశారు. 3 సంవత్సరాల వారంటీతో ఈ గ్యాడ్జెట్ లభ్యమవుతుంది.

ప్రత్యేకంగా మల్టీ నేషనల్ కంపెనీలను టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయి ఆధునికతతో లెనోవో రూపొందించిన మరో డెస్క్ టాప్ పీసీ ‘M71e’, పొందుపరిచిన ఫీచర్లు పరిశీలిస్తే.. 15 సెకన్లలోనే వేగవంతమైన బూటింగ్, 2.0 క్యాపబులిటీ, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ ఉద్యోగులకు సహకరించే విధంగా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను అధునాతన పీసీలో ఏర్పాటు చేశారు.

‘బిజినెస్ ప్రొఫెషనల్స్’ను లక్ష్యంగా చేసుకుని లెనోవో రూపొందించిన మరో పీసీ ‘లెనోవో ధింక్ సెంటర్ M77’ అధునాత AMD టెక్నాలజీ మరియు మల్టీ డిస్ ప్లే అంశాలతో డిజైన్ చేయబడింది. 16GB DDR3 మెమరీ సామర్ధ్యం, 1 TB హార్డ్ డ్రైవ్, ATI రేడియన్ గ్రాఫిక్స్ తదితర అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

భారతీయ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే లెనోవో ధింక్ సెంటర్ ‘M71z’ రూ.35,000, ‘M71e’ డెస్క్ టాప్ రూ.32,000, ‘M77’ రూ.27,000 ఉండోచ్చని తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting