Home
Computer

రెండు స్క్రీన్ లతో లెనోవో కొత్త ల్యాప్‌టాప్ లాంచ్! ధర, ఫీచర్లు చూడండి!

By Maheswara

లెనోవో గత సంవత్సరం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో థింక్‌బుక్ ప్లస్ జెన్ 3ని లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ బ్రాండ్ ఈ పరికరాన్ని భారతీయ మార్కెట్లోకి కూడా తీసుకువచ్చింది. ఇది క్రియేటివ్ మరియు ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన హై-ఎండ్ ల్యాప్‌టాప్ ఇది. ఈ ల్యాప్‌టాప్ రెండు డిస్ప్లే లతో వస్తుంది.

ఇది ASUS యొక్క జెన్‌బుక్ డుయో లైనప్ డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌లను పోలి ఉంటుంది. ఇది బాక్స్ లో మరియు ఫీచర్లలో ఏమి ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.

Lenovo ThinkBook Plus Gen 3 Laptop With Two Screens And Stylus Pen Support Launched In India.

లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ అనేది 21:10 అల్ట్రా-వైడ్ రేషియోతో 17.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే. ఇది 3K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 99 శాతం DCI-P3 మరియు 400 nits ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ పరికరం టచ్ ఇన్‌పుట్ మరియు డాల్బీ విజన్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా, ఈ థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 కీబోర్డ్‌కు కుడి వైపున సెకండరీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది ల్యాప్‌టాప్ లో పొందుపరిచిన టాబ్లెట్ వలె కనిపిస్తుంది.

ఈ సెకండరీ డిస్‌ప్లే HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 350 nits పీక్ బ్రైట్‌నెస్, 60 శాతం NTSC కలర్లు మరియు టచ్ సపోర్ట్‌తో కూడిన 8-అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇది మీ ప్రొడక్టివిటీ ని పెంచే యాప్‌లు, ఫోన్ సమకాలీకరణ, కంటెంట్ మిర్రరింగ్ మరియు మరిన్నింటి ఫీచర్లను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

ఇక ముందు భాగంలోఆడియో స్పీకర్స్ అమర్చబడి ఉంటాయి, లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 డాల్బీ అట్మోస్‌కు మద్దతుతో డ్యూయల్ 2W హర్మాన్ కార్డాన్ పవర్డ్ స్టీరియో స్పీకర్‌లతో అమర్చబడి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ మరియు షట్టర్ గోప్యతతో FHD ఇన్‌ఫ్రారెడ్ వెబ్‌క్యామ్ లు ఉన్నాయి.

Lenovo ThinkBook Plus Gen 3 Laptop With Two Screens And Stylus Pen Support Launched In India.

ఇంకా, లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ ఆన్‌బోర్డ్‌తో జత చేయబడింది. ఈ ల్యాప్‌టాప్ 16GB LPDDR5 RAM మరియు 1TB SSD స్టోరేజీ ను ప్యాక్ చేస్తుంది. రెండూ వరుసగా 32GB మరియు 2TB వరకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ 70Wh బ్యాటరీతో 100W వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ USB-C థండర్ బోల్ట్ 4 పోర్ట్, USB-C పోర్ట్, USB-A పోర్ట్, HDMI పోర్ట్, 3.5mm జాక్, Wi-Fi 6E మరియు బ్లూటూత్ వెర్షన్ 5.2 వంటి కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో OSలో పనిచేస్తుంది.

లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ప్రారంభ ధర రూ. 1,94,990 గా ఉంది. మరియు కంపెనీ వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారతదేశంలో Lenovo కొత్త 2-in-1 కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. ఇది లెనోవో యోగ 9i పేరుతో లాంచ్ అయింది. లెనోవో యోగా సిరీస్‌లోని తాజా ల్యాప్‌టాప్ 14-అంగుళాల 4K OLED డిస్‌ప్లే మరియు 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ లెనోవో యోగ 9i లాప్ టాప్ స్టార్మ్ గ్రే మరియు వోట్మీల్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

Best Mobiles in India

English summary
Lenovo ThinkBook Plus Gen 3 Laptop With Two Screens And Stylus Pen Support Launched In India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X