లెనోవో నుంచి సరికొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌!

Posted By: Staff

లెనోవో నుంచి సరికొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌!

 

నెం.1 కంప్యూటర్ల ఉత్పత్తి సంస్థ లెనోవో  'థింక్ సెంటర్ ఎడ్జ్ 62జడ్' పేరుతో ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌ పీసీని విడుదల చేసింది. చిన్న తరహా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని దీనిని తీసువచ్చినట్టు కంపెనీ తెలిపింది. తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ కంప్యూటర్‌ను గృహ వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీని ధరను 26,000 రూపాయలుగా (పన్నులు మినహా) నిర్ణయించారు. సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లు ఆక్రమించే స్థలంతో పోల్చితే ఈ కంప్యూటర్ ద్వారా 65 శాతం స్థలాన్ని ఆదా చేసుకోవచ్చని కంపెనీ అంటోంది. సిపియు వ్యవస్థ అంతా మానిటర్‌లోనే నిక్షిప్తం అయి ఉంటుంది. వైర్‌లెస్ కీబోర్డు, వైర్‌లెస్ మౌస్‌లను దీనికి వినియోగిస్తారు. వెబ్ కాన్ఫరెన్సింగ్ నిర్వహించే ఫీచర్‌తో పాటు వేగంగా బూటింగ్ జరగడం, విద్యుత్‌ను ఆదా చేయడం దీని అదనపు ప్రత్యేకతలు.

కీలక స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 7 ప్రొఫెషనల్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,

ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,

వేగవంతమైన సిస్టం బూట్-అప్,

సుపీరియర్ వెబ్-కాన్ఫిరెన్సింగ్, కీస్ట్రోక్ నాయిస్ సప్రెషన్,  హెచ్‌పి వెబ్‌క్యామ్,

డీవీడీ రీడ్/రైట్ డ్రైవ్,

ఇంటిగ్రేటెడ్ 2వాట్ స్పీకర్స్,

యూఎస్బీ పోర్ట్,

సెల్ఫ్-ఎన్‌క్రిప్టింగ్ డ్రైవ్స్,

హార్డ్‌వేర్ పాస్‌వర్డ్ మేనేజర్,

18.5 వాట్ ఎల్‌సీడీ,

అప్ టూ1టాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

అప్ టూ 8జీబి డీడీఆర్3 ర్యామ్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot