చిన్నవైనా చాకుల్లా పనిచేస్తాయ్!

తింక్ సెంటర్ ఎం72ఈ, తింక్ సెంటర్ ఎమ్92పి మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ అత్యంత చిన్న ఎంటర్‌ప్రైజ్ కంప్యూటర్ లను లెనోవో డిజైన్ చేసింది. వీటి ధర రూ.23,500 . తాజా ఆవిష్కరణతో డెస్క్‌టాప్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది.
లెనోవో తింక్‌ప్యాడ్ టీ430:
లెనోవో మరో శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. పేరు లెనోవో ధింక్ ప్యాడ్ టీ430. వేగవంతమైన కంప్యూటింగ్‌ను ఉత్పత్తి చేసే విధంగా శక్తివంతమైన 22ఎన్ఎమ్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లను ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇతర కీలక ఫీచర్లను పరిశీలిస్తే…
14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,
డ్యూయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్,
6జీబి మెమెరీ,
4 ఇన్ 1 కార్డ్ రీడర్,
500జీబి హార్డ్ డ్రైవ్,
హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,
6 సెల్ బ్యాటరీ,
1333మెగాహెడ్జ్ డీడీఆర్3 ర్యామ్,
ఐంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,
హై డెఫినిషన్ కెమెరా,
యూఎస్బీ కనెక్టువిటీ,
హైడెఫినిషన్ మైక్రోఫోన్స్,
వై-ఫై,
జిగాబిట్ ఇతర్‌నెట్.
లెనోవో థింక్ ప్యాడ్ టీ4320 ఉత్తమమైన డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ఉత్తమ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరిస్తుంది. ల్యాపీలో నిక్షిప్తం చేసిన మల్టీ బర్నర్ ఫీచర్ ఆప్టికల్ DVD±RW మన్నికైన పనితీరు ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








