బిజినెస్ ఇక భరోసాతో.!!!

Posted By: Staff

బిజినెస్ ఇక భరోసాతో.!!!

 

రోజు వారి వ్యాపార ప్రయోజనాల కోసం లెనోవో సరికొత్త బిజినెస్ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ఉత్తమమైన ఈ కంప్యూటింగ్ డివైజ్‌లో దోహదం చేసిన ఫీచర్స్ అదేవిధంగా స్పెసిఫికేషన్‌లు వినియోగదారుడికి పూర్తి స్థాయి లబ్ధి చేకూరుస్తాయి. ‘లెనోవో థింక్ ప్యాడ్ ఎడ్జ్ E520’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ల్యాపీ పనితీరు క్లుప్తంగా...

వ్యాపారస్తులు తమ విలువైన సమాచారాన్ని స్టోర్ చేసుకునేందుకు గాను సమర్దవంతమైన స్టోరేజ్ వ్యవస్థను ల్యాపీలో ఏర్పాటు చేశారు. సెకన్ల వ్యవధిలో లావాదేవీలను నిర్వహించుకునేందుకు గాను శక్తివంతమైన ఇంటెల్ కోర్ i3-2350M డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన ఇంటెల్ హై-డెఫినిషన్ 3000 గ్రాఫిక్ వ్యవస్థ అజేయమైన ప్రదర్శనను కనబరుస్తుంది. విండోస్ XP మోడ్‌తో చేర్చబడిన విండోస్ 7 ప్రొఫెషనల్ 64 బిట్ మల్టీ క్యాపబుల్ ఆపరేటింగ్ సిస్టంను డివైజ్‌లో వృద్థి చేశారు. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఈ వోఎస్ ద్వారా విండోస్ 7 నుంచి XP మోడ్‌లోకి ప్రవేశించి పాత వ్యాపర అప్లికేషన్‌లను సమర్దవంతంగా నిర్వహించుకోవచ్చు.

720 పిక్సల్ సామర్ధ్యం గల హైడెఫినిషన్ వెబ్ క్యామ్ వ్యవస్థను డివైజ్‌లో దోహదం చేశారు. ఈ వెబ్‌క్యామ్ సౌలభ్యతతో ఆన్‌లైన్ వీడియో ఛాటంగ్‌ను మన్నికైన శ్రేణిలో ప్రత్యక్షంగా నిర్వహించుకోవచ్చు. ల్యాపీ స్ర్కీన్ పరిమాణం 15.6 అంళుళాల కలిగి ఉత్తమ

డిస్‌ప్లేను విడుదల చేస్తుంది. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన 4జీబి డిడిఆర్ 3 ర్యామ్ వ్యవస్థ డివైజ్ మెమెరీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. రూపొందించిన కీప్యాడ్, టచ్‌ప్యాడ్ వ్యవస్థలు సౌకర్యవంతమైన ఆపరేటింగ్‌కు తోడ్పడుతాయి. హెచ్డీఎమ్ఐ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు ల్యాపీ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పటిష్టతం చేస్తుంది.

వ్యాపార లావాదేవీలను సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు అనువుగా ఉండే ఈ ‘లెనోవో థింక్ ప్యాడ్ ఎడ్జ్ E520’ ధర ఇతర విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot