‘లెనోవో’ ప్రకటన అధికారికమేనా..?

Posted By: Prashanth

‘లెనోవో’ ప్రకటన అధికారికమేనా..?

 

2012 గ్యాడ్జెట్ ప్రపంచంలో యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ క్రీయాశీలక పాత్ర పోషిస్తుందని టెక్ వర్గాలు ధృడ నిశ్చయంతో ఉన్నాయి. అనేక టాబ్లెట్ కంప్యూటర్ ఉత్పాదక సంస్థలు ఇప్పటికే ‘ఐసీఎస్’ అపడేట్‌కు సంబంధించి ఓ కొలిక్కి వచ్చాయి. మార్కెట్లో విడుదల కాబోతున్న టాబ్లెట్ పీసీలు దాదాపు ‘ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఫ్లాట్ ఫామ్’ పై రన్ కానున్నాయి. ఈ కోవకే చెందిన లెనోవో తన తాజా ఆవిష్కరణ ‘న్యూ థింక్ ప్యాడ్’ టాబ్లెట్ పీసీలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ తాజా నవీకరణకు సంబంధించి అధికారక ప్రకటనను లోనోవో వర్గాలు వెలువరించాయి.

‘లెనోవో థింక్ ప్యాడ్’ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఎన్-విడియా టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 10.1 అంగుళాల పరిమాణం గల డిస్‌ప్లే,

* గొరిల్లా గ్లాస్ కవర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot