పని పూర్తి చెయ్యటంలో ‘కింగ్’!

By Prashanth
|
Lenovo ThinkPad L430


ఉత్తమ క్వాలిటీ కంప్యూటర్లను డిజైన్ చెయ్యటంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చకున్న లెనోవో తాజగా థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి ఓ అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. పేరు ఎల్430. శక్తివంతమైన ఇంటెల్ మూడవ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే…….

14 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ (1366 x 768పిక్సల్స్),

మన్నికతో కూడిన గ్రాఫిక్ యూనిట్,

ఇంటెల్ చిప్‌సెట్,

హై డెఫినిషన్ వెబ్‌కెమెరా,

వీడియో రికార్డింగ్,

8జీబి డీడీఆర్3 ర్యామ్,

1టాబ్ హార్డ్‌డ్రైవ్,

ఎక్స్‌ప్రెస్ కార్డ్‌స్లాట్,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

ఇన్‌బుల్ట్ స్పీకర్స్,

డాల్బీ హోమ్ ధియోటర్ వీ4 ఎఫెక్ట్,

స్టాండర్డ్ Li-ion 6600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 9.5 గంటలు),

ధర అంచనా రూ.50,000.

ల్యాపీలో నిక్షిప్తం చేసిన డీవీడీ ఆర్‌డబ్ల్యూ ఆప్టికల్ డ్రైవ్, హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, డాల్బీ హోమ్ ధియోటర్, ఇన్‌బుల్ట్ స్పీకర్స్ తదితర అంశాలు యూజర్‌కు అదనపు అనుభూతులను చేరువ చేస్తాయి. లోడ్ చేసిన ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసర్ పటిష్టమైన పనివ్యవస్థను కలిగి ఉంటుంది. మరో ఫీచర్ ఫింగర్ ప్రింట్ రీడర్ సెక్యూరిటీ వ్యవసస్థను మరింత బలోపేతం చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మల్టీ టాస్కింగ్ కు సహకరిస్తుంది. దోహదం చేసిన ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ ఉత్తమమైన గ్రాఫిక్ విజువల్స్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ 9.5గంటల సుధీర్ఘ బ్యాకప్ నిస్తుంది. జూన్ నాటికి ‘థింక్ ప్యాడ్ L430’అందుబాటులోకి రానుంది. ధర అంచనా రూ.50,000, క్వాలిటీ కంప్యూటింగ్‌ను కోరుకునే వారికి ఈ గ్యాడ్జెట్ ఉత్తమ ఎంపిక.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X