Home
Computer

మార్కెట్లోకి లెనోవో థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లు

చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

By Bommu Sivanjaneyulu

చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. థింక్‌ప్యాడ్ పీ1, థింక్ ప్యాడ్ పీ72 పేర్లతో ఈ ల్యాపీలు అందుబాటులో ఉంటాయి. శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెక్స్‌తో లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ డివైసెస్ ప్రొఫెషనల్‌ స్థాయి కంప్యూటింగ్‌ను ఆఫర్ చేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. వీటిలో లెనోవో పీ1 వర్క్‌స్టేషన్‌ను అతి నాజూకైనా ఇంకా తేలికైన ల్యాప్‌టాప్‌గా లెనోవో అభివర్ణిస్తోంది. 1.7కిలో గ్రాములు బరువును కలిగి ఉండే ఈ డివైస్ 18.8 మిల్లీ మీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది.

ఆగష్టు చివరి నుంచి మార్కెట్లో లభ్యం

ఆగష్టు చివరి నుంచి మార్కెట్లో లభ్యం

ఈ రెండు ల్యాప్‌టాప్స్ 8వ తరం ఇంటెల్ Xeon ప్రాసెసర్స్ పై రన్ అవుతాయని లెనోవో తెలిపింది. ఈ రెండు డివైస్‌లు ఆగష్టు చివరి నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి. థింక్‌ప్యాడ్ పీ1 స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4కే యూహెచ్‌డి (3840 x 2160) రిసల్యూషన్ కారణంగా 4కే కంటెంట్‌ను ఈ ల్యాపీ స్ట్రీమ్ చేయగలుగుతుంది. 8వతరం ఇంటెల్ Xeon E-2176M సిక్స్ కోర్ ప్రాసెసర్ పై ల్యాపీ రన్ అవుతుంది. ఎన్‌విడియా క్వాడ్రో పీ2000 గ్రాఫిక్ కార్డును ప్రాసెసర్‌తో పెయిర్ చేసారు.

మిలటరీ గ్రేడ్ క్వాలిటీ..

మిలటరీ గ్రేడ్ క్వాలిటీ..

64జీబి డీడీఆర్4 మెమురీతో పాటు 4టీబి స్టోరేజ్‌ను ల్యాపీ కలిగి ఉంది. బ్లాక్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్‌తో దగదగలాడి పోయే ఈ ల్యాప్‌టాప్ 12 రకాల మిలటరీ గ్రేడ్ పరీక్షలతో పాటు 200 రకాల క్వాలిటీ చెకప్స్‌లో పాస్ అయ్యిందని లెనోవో తెలిపింది. ఈ ల్యాపీలో రెండు థండర్ బోల్ట్ పోర్ట్స్‌తో పాటు యూఎస్బీ 3.1, హెచ్‌డిఎమ్ఐ వంటి సాంప్రదాయ కనెక్టర్స్‌ను లెనోవో ఏర్పాటు చేసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ల్యాపీ రన్ అవుతుంది. బ్లుటూత్ 5.0 కనెక్టువిటీనీ ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఏకధాటిగా 13 గంటల పాటు వినియోగించుకోవచ్చని లెనోవో చెబుతోంది. యూఎస్ మార్కెట్లో ఈ ల్యాపీ ధర 1,949 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.1,35,700.

4కే కంటెంట్‌ను స్ట్రీమ్ చేయగలుగుతాయి..

4కే కంటెంట్‌ను స్ట్రీమ్ చేయగలుగుతాయి..

ఇక థింక్‌ప్యాడ్ పీ72 స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ల్యాప్‌టాప్ 17.3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4కే యూహెచ్‌డి (3840 x 2160) రిసల్యూషన్ కారణంగా 4కే కంటెంట్‌ను ఈ ల్యాపీ స్ట్రీమ్ చేయగలుగుతుంది. 8వ తరం ఇంటెల్ Xeon E-2176M సిక్స్ కోర్ ప్రాసెసర్ పై ల్యాపీ రన్ అవుతుంది. ఎన్‌విడియా క్వాడ్రో పీ5200 16జీబి గ్రాఫిక్ కార్డును ప్రాసెసర్‌తో పెయిర్ చేసారు. 128జీబి డీడీఆర్4 మెమురీతో పాటు 6టీబి స్టోరేజ్‌ను ఈ ల్యాపీ ఆఫర్ చేస్తుంది.

ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ రికగ్నిషన్, విండోస్ హల్లో..

ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ రికగ్నిషన్, విండోస్ హల్లో..

ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ రికగ్నిషన్, విండోస్ హల్లో వంటి ఫీచర్లను ఈ ల్యాపీ సపోర్ట్ చేస్తుంది. ల్యాపీ బరువు 3.4 కిలో గ్రాములుగా ఉంటుంది. ఈ ల్యాపీలో రెండు థండర్‌బోల్ట్ 3 పోర్ట్స్‌తో పాటు మూడు యూఎస్బీ 3.1, హెచ్‌డిఎమ్ఐ, 4 ఇన్ 1 ఎస్‌డి కార్డ్ రీడర్, మినీ డిస్‌ప్లే పోర్ట్ వంటి కనెక్టర్స్‌ను లెనోవో ఏర్పాటు చేసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ల్యాపీ రన్ అవుతుంది. బ్లుటూత్ 5.0 కనెక్టువిటీనీ ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. లెనోవో వాంటేజ్, McAfee లివ్‌సేఫ్ (30 రోజుల ట్రెయిల్), మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 (ట్రెయిల్ వెర్షన్) యూఎస్ మార్కెట్లో ఈ ల్యాపీ ధర 1799 డాలర్లుగా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.1,25,400.

Best Mobiles in India

English summary
Lenovo has launched two new products - ThinkPad P1 and ThinkPad P72 - for professionals looking for powerful hardware. The Lenovo P1 workstation notebook is touted to be the thinnest and lightest laptop by the company, measuring at 18.4mm and weighing at 1.7kgs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X