లెనోవో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్!!!

Posted By: Super

 లెనోవో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్!!!

 

ప్రముఖ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిదారు లెనోవో (Lenovo) శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ‘తింక్ ప్యాడ్ U300e’గా వస్తున్న ఈ ధృడమైన ల్యాపీలో మూడవ జనరేషన్ ఐవీవై బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ఈ ప్రాసెసర్ ల్యాపీ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది. లేటెస్ట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై  డివైజ్ రన్ అవుతుంది. 13.3 అంగుళాల క్వాలిటీ హై డెఫినిషన్ డిస్‌ప్లే నాణ్యమైన పెద్ద తెర అనుభూతిని ప్రసాదిస్తుంది.

500జీబి సామర్ధ్యం గల హార్డ్‌‌డిస్క్  డ్రైవ్, ల్యాపీ మెమరీ పటిష్టతను పెంచుతుంది. ర్యామ్ సామర్ధ్యం 8జీబి, ఇన్‌బుల్ట్ వెబ్‌క్యామ్ ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. పొందుపరిచిన బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు ల్యాపీ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. డివైజ్‌లో ఏర్పాటు చేసిన హెచ్డీఎమ్ఐ పోర్ట్ ద్వారా హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. అప్‌డేటెడ్ ఫీచర్లతో స్టైలిష్‌గా రూపుదిద్దుకున్న ‘లెనోవో థింక్ ప్యాడ్ U300e’ ధర ఇండియన్ మార్కెట్లో రూ.45,000 నుంచి రూ. 50, 000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot