ఆగస్టు 21.. ఆ ఫ్యాన్స్‌కు పండుగ రోజు!

Posted By: Prashanth

ఆగస్టు 21.. ఆ ఫ్యాన్స్‌కు పండుగ రోజు!

రెండవ అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్‌ల తయారీ సంస్థ లెనోవో తాజాగా ప్రకటించిన ల్యాప్‌టాప్ ‘థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్’ ఆగస్టు 21 నుంచి లెనోవో డాట్ కామ్ ద్వారా లభ్యం కానుంది. కొత్త జనరేషన్ టాబ్లెట్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌ల స్పూర్తితో ఈ ల్యాపీని డిజైన్ చేశారు.

అత్యున్నత డిజైన్:

14 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉన్న ‘థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్’ అల్ట్రా స్లీక్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. బరువు కేవలం మూడు పౌండ్లు. ల్యాపీ పై కవర్‌ను మన్నికైన కార్బన్ ఫైబర్ పదార్ధంతో నిర్మించారు. దింతో పీసీ మన్నిక మరింత ధృడత్వాన్ని సంతరించుకుంటుంది.

సాఫ్ట్‌వేర్ ఫీచర్లు:

శక్తివంతమైన మూడవ జనరేషన్ ఐ5 ప్రాసెసర్‌ను ల్యాపీలో వినియోగించారు. బ్యాక్ లైట్ కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది. ల్యాపీ డిస్‌ప్లే రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్. పొందుపరిచిన స్పీకర్ వ్యవస్థ క్లారిటీతో కూడిన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. నిక్షిప్తం చేసిన డాల్బీ హోమ్ ధియోటర్ వీ4 సాఫ్ట్‌వేర్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన ఆడియో అనుభూతులను చేరువ చేస్తుంది. ల్యాపీ వెబ్‌క్యామ్‌లో లోడ్ చేసిన ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ క్వాలిటీ వీడియో చాటింగ్‌ను అందిస్తుంది.

కనెక్టువిటీ ఫీచర్లు:

3జీ కనెక్టువిటీ అంతరాయంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను సమకూరుస్తుంది. 4 ఇన్ 1 మీడియా కార్డ్‌రీడర్, హెడ్‌సెట్ జాక్, మినీ డిస్‌ప్లే పోర్ట్, పవర్ జాక్, వై-ఫై స్విచ్ తదితర ఫీచర్లు ల్యాపీ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

ధరలు:

‘థింక్ ప్యాడ్ ఎక్స్1 కార్బన్’ నాలుగు కాన్ఫిగరేషన్‌లలో విడుదల కాబోతుంది.

- మొదటి వేరియంట్ ప్రత్యేకతలు: ఇంటెల్ కోర్ ఐ5-3317U ప్రాసెసర్, 128జీబి ఎస్ఎస్‌డీ డ్రైవ్. ధర రూ.77,038.

- రెండవ వేరియంట్ ప్రత్యేకతలు: కోర్ ఐ5-3427Uప్రాసెసర్, 3జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ యాంటీనా,

- మూడవ వేరియంట్ ప్రత్యేకతలు : కోర్ ఐ5-3427Uప్రాసెసర్, 256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ధర రూ.90,803,

- నాలుగవ వేరియంట ప్రత్యేకతలు: కోర్ ఐ7-3667Uప్రాసెసర్, 256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ధర రూ. 1,01,817.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot