లెనోవో నుంచి బెస్ట్ ఫీచర్లతో థింక్ పాడ్ ఎక్స్ ల్యాపీలు

ప్రముఖ సంస్థ లెనోవో నుంచి థింక్ పాడ్ ఎక్స్1 మరో సారి అదనపు ఫీచర్లతో లాంచ్ అయ్యంది.

|

ప్రముఖ సంస్థ లెనోవో నుంచి థింక్ పాడ్ ఎక్స్1 మరో సారి అదనపు ఫీచర్లతో లాంచ్ అయ్యంది. దీంతో పాటు లెనోవో నుంచి నూతన మోడల్స్ థింక్ పాడ్ టీ, అలాగే థింక్ పాడ్ ఎక్స్, థింక్ పాడ్ ఎల్ సిరీస్ కూడా విడుదల అయ్యాయి. ఈ కొత్త పాడ్స్ అన్నీ కూడా ఇంటెల్ కోర్ 8వ జనరేషన్ ప్రాసెసర్స్ తో పాటు యూఎస్‌బీ టైప్ సీ పవర్ అడాప్టర్స్ ను కలిగి ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్ ప్రారంభ ధర రూ.1,21,000, థింక్ ప్యాడ్ ఎక్స్ 1 యోగా ధర రూ.1,26,000, థింక్ ప్యాడ్ ఎక్స్ 280 ధర రూ. 73,000, థింక్ ప్యాడ్ ఎక్స్ 380 యోగా రూ. 87,000, థింక్ ప్యాడ్ టీ 480 ధర రూ.69,000, థింక్ ప్యాడ్ టీ480ఎస్ రూ.86,000, థింక్ ప్యాడ్ టీ 580 ధర రూ. 74,000, థింక్ ప్యాడ్ ఎల్ 380 యోగా ధర రూ.Rs. 65,000, థింక్ ప్యాడ్ ఎల్ 380 ధర రూ. 61,000, థింక్ ప్యాడ్ ఎల్ 480 ధర రూ.54,000, అలాగే థింక్ ప్యాడ్ ఎల్ 580 ధర రూ.55,000లుగా నిర్ణయించారు. ఈ మోడల్స్ అన్నీ కూడా ఈ నెల నుంచే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

Lenovo ThinkPad X1 Carbon

ఇక బార్సిలోనాలో జరిగిన సీఈఎస్ 2018 సదస్సులో విడుదల చేసిన థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్ ప్రపంచంలోనే అత్యంత తేలికైన 14 ఇంచుల బిజినెస్ ల్యాప్ టాప్ గా పేరొందింది. అలాగే కార్బన్ ఫైబర్ తో చేసిన బాడీ ద్వారా అత్యంత తేలికైన ల్యాప్ టాప్ గా థింక్‌పాడ్ ఎక్స్ 1 పేరుగాంచింది. ఇక అందులో ఫీచర్ల విషయానికి వస్తే ఇది పూర్తిగా ఫుల్ హెచ్ డీ తో పాటు టచ్ టెక్నాలజీతో డాల్బీ విజన్ ను కలిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో ఎనిమిదో జనరేషన్ కు చెందిన కోర్ ప్రాసెసర్ (ఇంటెల్ కోర్ ఐ7, వీప్రో)ను వాడారు. అలాగే ఇంటెల్ యూహెచ్‌డీ 620 గ్రాఫిక్స్ తో పాటు 16జీబీ ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్ ను వినియోగించారు.

సరికొత్త అనుభూతిని అందిస్తున్న వన్‌ప్లస్ వాల్‌పేపర్లుసరికొత్త అనుభూతిని అందిస్తున్న వన్‌ప్లస్ వాల్‌పేపర్లు

ఇలాగే 1 టీబీ స్టోరేజీని ఈ థింక్ ప్యాడ్ కలిగి ఉంది. ఇక వెబ్ క్యామ్ విషయానికి వస్తే టాప్ కవర్ 720 హెచ్‌డీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఐ ట్రాకింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికి థింక్ ప్యాడ్ ఎక్స్ 1 లో వైఫై 802, 11 ఏసీ బ్లూతూట్ కలిగి ఉన్నాయి. అలాగే రెండు ఇంటెల్ థండర్ బోల్ట్ పోర్ట్స్, ఒక హెడ్ ఫోన్ సెట్ విత్ మైక్రోఫోన్, త్రీ ఇన్ వన్ మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్స్ ప్యాడ్ తోపాటు లభిస్తాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 57 వాట్స్ బ్యాటరీతో పాటు ఒక సారి ఫుల్ చార్జీ చేస్తే 19.3 గంటల పాటు నిరాటంకంగా వాడే వీలుంది.

Lenovo ThinkPad X1 Carbon

థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్ తరహాలోనే థింక్ ప్యాడ్ ఎక్స్ 1 యోగా కూడా ఇంటెల్ కోర్ ఐ7 ప్రొసెసర్ కలిగి ఉ:ది. అాగే ఈ 14 ఇంచుల నోట్ బుక్ 360 డిగ్రీలు వంచే వీలుంది. అాగే ఇందులో ఎక్స్ 1 కార్బన్ తరహా ఫీచర్లతో పాటు బ్యాటరీ బ్యాకప్ 15 గంటల పాటు ఇఛ్చారు. అలాగే ఒక ఇంటిగ్రేటెడ్ పెన్ తోపాటు గ్లోబల్ ఎల్ టీఈ ఏ క్యాపబిటిటీ కలిగిఉంది.

ఇక టాప్ ఎండ్ వెర్షన్ల అనంతరం చూస్తే థింక్ ప్యాడ్ ఎక్స్280, ఎక్స్380 యోగా మోడాల్స్ లో కూడా పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే థింక్ ప్యాడ్ ఎక్స్ 280లో 12.5 ఇంచుల డిస్‌ప్లేతోపాటు హెచ్.డీ, ఫుల్ హెచ్.డీ కలిగి ఉన్నాయి. అలాగే ఇంటెల్ కోర్ ఐ 7 తో పాటు డాల్బీ 720 హెచ్‌డీ కెమెరా, థింక్ షట్టర్ కవర్ కలిగి ఉ:ది. అలాగే ఈ రెండు మోడల్స్ లో బిల్టిన్ బ్యాటరీతో పాటు 16.6 గంటల బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉంది.

ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయటప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయట

ఇక థింక్ ప్యాడ్ టీ480, టీ480ఎస్, టీ580 వెర్షన్ మోడల్స్ లో బ్యాటరీ విషయంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారు. బ్యాటరీ బ్యాకప్ సుమారు 27 గంటల పాటు ఇవ్వడం విశేషం. టీ480లో 14 ఇంచుల డిస్‌ప్లేతోపాటు హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక థింక్ ప్యాడ్ ఎల్ 380, ఎల్ 380 యోగా, ఎల్ 480, ఎల్ 580 లు బిజినెస్ పర్పస్ కోసం డిజైన్ చేయడం జరిగింది. వీటిలో ఎల్ 380, యోగా 13.3 ఇంచుల డిస్‌ప్లే పానెల్స్ తో పాటు హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేతో పాటు ఎఎండీ రేడియాన్ 530 గ్రాఫిక్స్ కార్డ్ కలిగి ఉంది. ఎల్ సిరీస్ లో మోడల్స్ బ్యాటరీ విషయానికి వస్తే 16.1 గంటల బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Lenovo ThinkPad X1 Carbon, ThinkPad X1 Yoga, Other ThinkPad Laptops Refreshed in India: Price, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X