‘మెగాస్టార్ రేంజ్’లో విడుదల చేద్దామని...!!

Posted By: Staff

‘మెగాస్టార్ రేంజ్’లో విడుదల చేద్దామని...!!

దమ్మున్న సాంకేతిక పరికరాల తయారీదారు ‘లెనోవో’ మరో సంచాలనానికి తెరలేపనుంది. ‘గ్యాడ్జట్ల’ అమ్మకాలకు స్వర్గధామంలాంటి భారతీయ మార్కెట్లో తేలిక పాటి ‘నోట్‌ప్యాడ్’ను విడుదల చసేందుకు కసరత్తులు పూర్తి చేస్తోంది. త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ పరికరం వ్యాపార వర్గాల్లో అంచనాలు రేకెత్తిస్తుంది.

‘థింక్ ప్యాడ్ X220’గా రూపుదిద్దకుంటున్న ఈ నోట్‌ప్యాడ్ మల్టీ టచ్ వ్యవస్థ కలిగి ఉంది. సమగ్ర సమచార వ్యవస్థతో పాటు లోడ్ చేసిన మల్టీ మీడియా అనుభూతి, శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ 16 గంటల పాటు నిరంతరాయంగా పవర్ సప్లైను అందిస్తుంది. పొందుపరిచిన ‘అవుట్ డోర్ వ్యూవబుల్’ ప్యానల్‌ను గొరిల్లా గ్లాస్‌తో రూపొందించారు. ఈ కారణంగా స్ర్కీన్ కిందపడినా చెక్కుచెదరకుండా ఉంటుంది.

శక్తివంతమైన సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థతో పాటు హై డెఫినిషన్ (HD) గ్రాఫిక్ వ్యవస్థ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి పలు అధునాతన ఫీచర్లు ఈ ‘ప్యాడ్’లో దర్శనమిస్తాయి. కీబోర్డులో పొందుపరిచిన ‘బటన్లు’ శబ్ధాలనుకలగి ఉంటాయి. హై డెఫినిషన్ కెమెరా నాణ్యమైన ఛాటింగ్, వీడియో కాన్ఫిరెన్స్ అనుభూతిని మీకు కల్పిస్తుంది.

అనుసంధానించిన యూఎస్ బీ 3.0 వ్యవస్థ అత్యంత వేగవంతంగా టేటాను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. 8జీబి ర్యామ్, 320జీబీ హార్డ్ డ్రైవ్ వంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి. నోట్‌ప్యాడ్‌లో ముందుగానే లోడ్ చేసిన అంశాలు ఆఫీస్ పనుల్లో ఉపయోగపడతాయి. అందుబాటులోకి రానున్న ‘లెనోవో థింక్ ప్యాడ్ X220 ’ రూ.70,000 మార్కెట్ ధరకు లభిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting