సరి కొత్త ‘లెనోవో’ మీ సొంతమైతే...?

Posted By: Super

సరి కొత్త ‘లెనోవో’ మీ సొంతమైతే...?

కొత్తదనం కోసం పాకులాడుతున్న ఫ్యాషన్ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీ దారు ‘లెనోవో’ 3 అద్భుతమైన ల్యాపీలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వినూత్నంతో పాటు వైవిధ్యాన్ని కోరుకునే వినియోగదారుల భావాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతికత, హుందాతనం, స్టైల వంటి లక్షణాలను పొందుపరిచి ‘లెనోవో’ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

లెనోవో యూ సిరీస్ లో విడుదలయిన ఈ ల్యాపీలు ఐడియా ప్యాడ్ U300s, అల్ట్రా బుక్ U300, U400 మోడళ్లలో దర్శనమిస్తున్నాయి.
వీటి ఫీచర్లను పరిశీలిస్తే ఐడియా ప్యాడ్ U300sలో పొందుపరిచిన ఇంటెల్ కోర్ i7 ప్రొసెసింగ్ వ్యవస్థకు టర్బో బూస్ట్ 2.0 టెక్నాలజి వ్యవస్థ వేగవంతమైన బూటింగ్ కు సహకరిస్తుంది. పొందు పరిచిన 4GB DDR3 RAM, 250 జీబీ మెమరీ స్టోరేజి వ్యవస్ధ వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. 16.9 అంగుళాల వైడ్ స్క్రీన్, సురక్షితమైన 13.3 అంగుళాల డిస్ ప్లే మెరుగైన పనితీరు కలిగి ఉంటుంది. 30 రోజుల స్టాండ్ బై మోడ్ , 8 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూర్చే అంశాలు. 2.0,3.0 యూఎస్బీ పోర్ట్స్, వై - ఫై 802.11 b/g/n, బ్లూటూత్ , 720 పిక్సల్స్ హెచ్ డి వెబ్ క్యామ్ వంటి అంశాలు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.

తక్కిన రెండు మోడళ్లైన ఐడియాప్యాడ్ U300, U400లలో ర్యాపిడ్ డ్రైవ్ ఎస్ఎస్ఎస్డి వ్యవస్థను పొందుపరిచారు. సెకండ్ జనరేషన్ ప్రొసెసర్లను పొందుపరిచారు. వీటి డిస్ ప్లే అంశాలను పరిశీలిస్తే U300 13.3 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యం కలిగి ఉండగా, U400 14 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. పొందుపరిచిన AMD Radeon HD5470M 1GB గ్రాఫిక్ ఎక్స్లేటర్ వ్యవస్థ హై డెఫినిషన్ సామర్ధ్యం కలిగిన వీడియోలను మీకు అందిస్తుంది. ఈ మోడళ్లలో పొందుపరిచిన ర్యామ్ ద్వారా స్టారేజి సామర్ధ్యాన్ని 8 జీబికి పెంచుకోవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే U300 6 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం కలిగి ఉండగా, U400 7 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే లెనోవో ఐడియా ప్యాడ్లు U300 $1199.99 , U400 $849.99లకు లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot