అల్ట్రాబుక్ మార్కెట్లో లెనోవో U300, ఆస్పైర్ s3 ‘ఢీ’!!

వీటి ఫీచర్లను పరిశీలిస్తే:
- ఈ రెండు అల్ట్రాబుక్ పరికరాలు 13.3 అంగుళాల సమాన డిస్‌ప్లే పరిమాణం కలిగి ‘హై డెఫినిషన్’ సామర్ధ్యంతో వినియోగదారుడికి మరింత లబ్ది చేకూరుస్తాయి.
- ఇంటెల్ i3, i5, i7 ప్రొసెసింగ్ యానిట్‌లను రెండు మోడళ్లలో ప్రవేశపెట్టారు.
- విండోస్ ప్రీమీయం ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ రెండు ల్యాపీలు పని చేస్తాయి.
- లెనోవో U330లోని ప్రత్యేక ఫీచర్లన పరిశీలిస్తే ‘ఇంటెల్ ఆడ్వాన్సడ్ కూలింగ్ టెక్నాలజి ఎయిర్ ఫ్లో’ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
- ఏసర్‌లోని ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే ‘ఏసర్ గ్రీన్ ఇన్స్టెంట్’, ‘ఏసర్ ఇన్స్టెంట్ కనెక్ట్’ వంటి ఫీచర్లు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
- ‘ఆస్పైర్ S3’ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు 320 నుంచి 500 జీబీ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి.
- ‘లెనోవో U300’లో పటిష్ట హార్డ్‌డిస్క్ డ్రైవ్ వ్యవస్థ 1 టీబీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- బూటింగ్‌లో ‘ఆస్పైర్ S3’ అత్యంత వేగవంతంగా స్పందిస్తుంది.
- రెండు గ్యాడ్జెట్లలో 1.3 మెగా సామర్ధ్యం గల వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
- ఆస్పైర్ S3 హెచ్ డీఎమ్‌ఐ అవుట్ ఆధారితంగా డాల్బీ v4.0 హోమ్ థియోటర్ వ్యవస్థకు సహకరిస్తుంది.
- వేగవంతమైన 802.11 b/g/n వై - ఫై సపోర్టు వ్యవస్థను రెండు పరికరాల్లో అనుసంధానం చేశారు.
- ఆస్పైర్ శక్తివంతమైన ‘v4.0’ బ్లూటూత్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- ఏసర్‌లో అమర్చిన ఫైన్ టిప్ చిక్లెట్ కీబోర్డు వ్యవస్థ టైపింగ్‌కు అనువుగా ఉంటుంది.
- ‘ఏసర్ ఆస్పైర్ S3’ ధరలను పరిశీలిస్తే వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ ల్యాపీలు రూ. 51,900 నుంచి రూ.77,900కు లభ్యమవుతున్నాయి.
- లెనోవో ఐడియా ప్యాడ్ U300 ధరలను పరిశీలిస్తే రూ. 37,000 నుంచి రూ.55,000 వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications