లెనోవో నుంచి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో ప్రపంచపు మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఈ ఆండ్రాయిడ్ ల్యాప్‍టాప్ పేరు ఏ10 (A10). ఇండియన్ మార్కెట్లో డివైజ్ అందుబాటు ఇంకా ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 లెనోవో నుంచి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్

ల్యాపీ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

10.1 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366x 768పిక్సల్స్), 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ల్యాపీ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం. 0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, రెండు యూఎస్బీ పోర్టులు, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, ల్యాపీ బరువు 1కిలో అంతకన్నా తక్కువ. పరిమాణం 17.3 మిల్లీమీటర్లు, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

ల్యాపీ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1366x 768పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ - ఏ9 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జబి ఇంటర్నల్ మెమెరీ,
0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,

ఇండియన్ మార్కెట్లో ‘లెనోవో ఏ10' రూ.15,000 అంతకన్నా ఎక్కువ విలువును కలిగిఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot