లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్స్.. రూ.17,490కే

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని లెనోవో 5 సరికొత్త ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అన్ని రకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ధర రేంజ్‌లలో అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ల వివరాలను పరిశీలించినట్లయితే...

Read More : కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Ideapad 510s

ఈ ల్యాపీ ధర రూ.51,190. 14 అంగుళాల స్ర్కీన్‌తో వచ్చే ఈ పోర్టబుల్ ల్యాప్‌టాప్‌ను ప్రత్యేకించి ఆన్ ద గో కంప్యూటింగ్ కోసం డిజైన్ చేసారు. 1 TB HDD లేదా 256 GB SSD స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ డివైస్‌ను ఎంచుకోవచ్చు. 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ పై ల్యాపీ రన్ అవుతుంది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఈ కంప్యూటింగ్ మెచీన్ రన్ అవుతుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్, AMD Radeo R7 M460 2 జీబి గ్రాఫిక్ కార్డ్ పనితీరుపరంగా ఆకట్టుకుంటుంది.

Ideapad 710s

ఈ ల్యాపీ ధర రూ.73,390. లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌లను ఇష్టపడే వారికోసం ప్రత్యేకించి వీటిని డిజైన్ చేసారు. హెవి డ్యూటీ పనితీరును అందించే ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 13.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్యానల్, హైస్పీడ్ PCIe సాలిడ్ స్టేట్ డ్రైవ్, క్విక్ ఛార్జింగ్ ఫెసిలిటీ, బిల్ట్ ఇన్ జేబీఎల్ స్టీరియో స్పీకర్స్, 16జీబి LPDDR3 ర్యామ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 6వ తరం ఐంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్.

Ideapad Y700

ఈ ల్యాపీ ధర రూ.128,090. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకించి డిజైన్ చేసారు. ఈ ల్యాపీతో పాటు రూ.19,496 విలువ చేసే హార్డ్ బండిల్డ్ గేమింగ్ కిట్‌ను కేవలం రూ.2,999కే అందిస్తున్నారు. ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. 15.6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఇంటెల్ ఐ7 6700హెచ్‌క్యూ ప్రాసెసర్, 16జీబి (2X8GBDDR4 2133) ర్యామ్, 1TB 7MM 5400RPM స్టోరేజ్, N16P-GX GDDR5 4G(HYBRID)గ్రాఫిక్ కార్డ్, ఆర్మర్డ్ బ్యాక్ ప్యాక్, మెకానికల్ మౌస్, గేమింగ్ మౌస్, స్పెషల్ హెడ్‌సెట్.

Ideapad 310

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాపీ ధర రూ.28,390. హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఈ ల్యాపీకి ప్రధాన ఆకర్షణ. డాల్బీ టెక్నాలజీతో కూడని స్టీరియో స్పీకర్లను ల్యాపీలో పొందుపరిచారు. 7వ తరం ఇంటెల్ సీపీయూతో వస్తోన్న ఈ ల్యాప టాప్ లో 1TB HDDతో పాటు 8GB DDR4 RAMను నిక్షిప్తం చేసారు.

Miix 310

ఈ 2 ఇన్ 1 పోర్టబుల్ కంప్యూటింగ్ మెచీన్ ధర రూ.17,490. కేవలం 580 గ్రాముల బరువుతో ఈ డివైస్‌ను ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ ఎలా కావాలంటే ఎలా వాడుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 10.1 అంగుళాల ఐపీఎస్
డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 64జీబి eMMC స్టోరేజ్, 4జీబి ర్యామ్, ఇంటెల్ ఆటమ్ X5 Z8350 ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్కెట్లలో ఈ ల్యాప్‌టాప్‌లు దొరుకుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo unveils new consumer laptops: Check out all latest models here. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot