ఇండియన్ మార్కెట్లో ‘లెనోవో’ హిట్ కొట్టనుందా...!!

Posted By: Super

ఇండియన్ మార్కెట్లో ‘లెనోవో’ హిట్ కొట్టనుందా...!!

కంప్యూటర్ పీసీలు తయారీదారైన లెనోవో (Lenovo), భారతీయ మార్కట్లో సరికొత్త టాబ్లట్ కంప్యూటర్‌ను విడుదల చేయునున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరిలో ఈ టాబ్లెట్ పీసీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లెనోవో సారధ్యంలో ఎస్‌ఎమ్‌బీ (SMB), ఎడ్జ్ (EDGE) వంటి అధునాతన విధానంతో రూపుదిద్దుకున్న 10 మోడళ్లు పీసీలతో పాటు ల్యాప్ టాప్‌లకు సంబంధించి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోడళ్లలో ప్రధానమైన థింక్ సెంటర్ ఎడ్జ్ 71z, థింగ్ ప్యాడ్ ఎడ్జ్ E420s (SSD), లెనోవో B570 మోడళ్లపై అంచనాలు నెలకున్నాయి.

తొలత లెనోవో ల్యాప్‌టాప్ల విషయానికి వస్తే ఎక్స్‌పీరీయన్స్‌డు 2.0 కంపేటబుల్ విండోస్ 7 వర్షన్ తో ఇవి రూపుదిద్దుకున్నాయి. ఈ విషయానికి సంబంధించి SMB మార్కెటింగ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘ అత్యాధినిక పరిజ్ఞానంతో రూపుదిద్దకుంటున్న మా పరికరాలు ఖచ్చితమైన పనితీరును ప్రదర్శించటంతో పాటు సమంజసమైన ధరల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు.

భారతీయ మార్కెట్లో ‘లెనోవో’ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు ‘లెనోవో ఇండియా’ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో నెలకున్న పోటీని తట్టకోవటంతో పాటు వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ఈ అధునాతన పరికాలను మార్కెట్లో ప్రవేశ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు

తాజాగా విడుదలైన ఐడీసీ (IDC) నివేదికలను పరిశీలిస్తే నోట్ బుక్ లతో పాటు డెస్క్ టాప్ పరికరాలకు మరింత డిమాండ్ పెరగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత మార్కెట్లో లెనోవోకు మంచి ఆదరణే ఉంది. అయితే ఈ తరుణంలో ‘లెనోవో’ తన కొత్త మోడళ్లను విడుదల చేసి ఇండియన్ మార్కెట్లో హిట్ కొట్టాలని చూస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot