లెనోవో నుంచి పవర్‌ఫుల్ విండోస్ 8 ల్యాప్‌టాప్స్!

Posted By: Prashanth

లెనోవో నుంచి పవర్‌ఫుల్ విండోస్ 8 ల్యాప్‌టాప్స్!

 

విండోస్ తన కొత్త‌వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ను ప్రకటించిన నేపధ్యంలో ప్రముఖ పీసీ తయారీ సంస్థలో విండోస్ 8 ఆధారిత కంప్యూటింగ్ గ్యాడ్జెట్‍‌లను డిజైన్ చేసేందుకు ఉవ్విలూరుతున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో (Lenovo) ఎస్300, ఎస్400, ఎస్405 మోడళ్లలో మూడు సరికొత్త ల్యాపీలను ఆవిష్కరించింది. విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టంతో లోడైన ఈ డివైజ్‌లను అక్టోబర్ 29తరువాత విండోస్ 8కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఎస్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలోని టచ్‌ప్యాడ్ వ్యవస్థను సంస్థ మరింత వృద్ధి చేసింది.

ఫీచర్లు:

ఈ మూడు ల్యాపీలు 21.9 మిల్లీమీటర్ల మందంతో 1.8కిలోగ్రాముల బరవును కలిగి ఉంటాయి. మూడు మోడళ్లలో ప్రాసెసర్ అదేవిధంగా హర్డ్‌డ్రైవ్ స్టోరేజ్ వ్యవస్థలు భిన్నంగా ఉంటాయి. ఎస్300, ఎస్400 మోడళ్లలో ఇంటెల్ మూడవ జనరేషన్ ఐ3, ఐ5 ప్రాసెసర్‌లను వినియోగించగా. లెనోవో ఎస్405లో శక్తివంతమైన ఏ8 క్వాడ్ కోర్ ఏపీయూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎస్300, ఎస్400 ల్యాపీలు 500జీబి సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్ స్టోరేజ్ డ్రైవ్‌లను కలిగి ఉండగా, లెనోవో ఎస్405 పటిష్టమైన 1 ట్యాబ్ ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉంది.

ప్రయోజనాలు:

పోర్టబులిటీ అదేవిధంగా స్టైలిష్ లుక్‌ను కలిగి ఉన్న ఈ డివైజ్‌లు వివిధ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్నాయి. నిక్షిప్తం చేసిన ‘క్విక్ స్టార్ట్’ అప్లికేషన్ వివిధ ప్రోగ్రామ్‌లను సులువగా యాక్సిస్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మరో అప్లికేషన్ ‘డైరెక్ట్ షేర్’ వెబ్ కనక్షన్‌తో పనిలేకుండా ఫైళ్లను ఇతర పీసీ లేదా ల్యాప్ టాప్‌తో సింక్రనైజ్ చేస్తుంది. మరో టూల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ బ్యాటరీ పటిష్టతను రెట్టింపు చేస్తుంది.

కలర్ ఇంకా ధర:

రెడ్, సిల్వర్ ఇంకా పింక్ కలర్ ఫార్మాట్‌లలో ఈ మూడు ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతున్నాయి. ధరలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అనధికారికంగా తెలిసిన వివరాల మేరకు వీటి ధరకు రూ.30,685 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting