Home
Computer

యాపిల్‌కు షాక్ ఇవ్వడానికి లెనోవో రెడీ.. అడ్వాన్స్‌డ్‌ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లతో మినీ పీసీలు!

By Ram Kumar

టెక్నాలజీ ప్రపంచంలో కంపెనీల మధ్య చాలా హెవీ పోటీ ఉంటుంది. యాపిల్‌కు కూడా ఇతర కంపెనీల నుంచి పోటీ తప్పడం లేదు. తాజాగా ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో సరికొత్త స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లతో కూడిన మినీ డెస్క్‌టాప్ PCలను ఆవిష్కరించింది. తద్వారా యాపిల్ మ్యాక్ మినీ పీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

లెనోవో ఈ సరికొత్త పీసీలను CES 2025లో ప్రకటించింది, ఇవి ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయని తెలిపింది. వాటి పేర్లు థింక్‌సెంటర్ నియో 50క్యూ క్యూసీ (ThinkCentre neo 50q QC), ఐడియాసెంటర్ మినీ ఎక్స్ (IdeaCentre Mini x).

Lenovo Unveils Snapdragon X Mini PCs to Compete with Apple s Popular Mac Mini

ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, పనితీరులో మాత్రం ఏ మాత్రం తీసిపోవు. వ్యాపారస్తుల నుంచి క్రియేటివ్ నిపుణుల వరకు, ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు.

* థింక్‌సెంటర్ నియో 50q QC: వ్యాపారాల కోసం పవర్ ప్యాక్డ్ పీసీ

చిన్న, మధ్య తరహా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని లెనోవో ఈ థింక్‌సెంటర్ నియో 50q QCని తీసుకొచ్చింది. ఇందులో అడ్వాన్స్‌డ్‌ 8-కోర్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్లస్ ప్రాసెసర్‌తో పాటు, కొత్తగా విడుదలైన స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌ను కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఏ ప్రాసెసర్ మోడల్‌ను ఉపయోగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫాస్ట్ పెర్ఫార్మన్స్ కోసం 16GB వరకు LPDDR5X RAMను ఇందులో అమర్చారు. అంతేకాదు, వై-ఫై 6E కనెక్టివిటీతో ఇది ఇంటర్నెట్‌కు మెరుపు వేగంతో కనెక్ట్ అవుతుంది.

పోర్టులు

ముందువైపు ఒక USB-A 3.2 Gen 2 పోర్ట్, ఒక USB-C 3.2 Gen 2 పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్‌సైడ్ రెండు USB-A 3.2 Gen 2 పోర్ట్‌లు, రెండు USB-A 2.0 పోర్ట్‌లు, ఒక HDMI 2.1 పోర్ట్, ఒక డిస్‌ప్లేపోర్ట్ 1.4 కనెక్షన్, ఒక ఈథర్‌నెట్ పోర్ట్ ఉన్నాయి.

ఈ మినీ PC ఫిబ్రవరి 2025 నుంచి అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర 849 డాలర్లు (దాదాపు రూ.73 వేలు)

* ఐడియాసెంటర్ మినీ ఎక్స్: క్రియేటివ్ ఎక్స్‌పర్ట్స్‌ కోసం ప్రత్యేకంగా..

ఐడియాసెంటర్ మినీ X మోడల్‌ను ప్రత్యేకంగా క్రియేటివ్ ఎక్స్‌పర్ట్స్‌, పవర్-యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీంట్లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ లేదా స్నాప్‌డ్రాగన్ X ప్లస్ ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చు. ఇంకాస్త ఎక్కువ పనితీరు కావాలనుకునేవారి కోసం 32GB వరకు RAM + 1TB SSD స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది.

ఈ మినీ పీసీ లేటెస్ట్ వై-ఫై 7 టెక్నాలజీతో వస్తుంది. దీని ద్వారా మరింత వేగంగా, స్థిరంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

దీని డిజైన్ చాలా బాగుంది. పవర్ సప్లై లోపలే ఉంటుంది. అంతేకాదు, అవసరమైనప్పుడు విడిభాగాలను మార్చుకోవడం కోసం దీని కేసును సులభంగా తెరవవచ్చు. వేడిని తగ్గించడానికి రెండు ఫ్యాన్లతో కూడిన కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది నాయిస్-ఫ్రీగా పనిచేయకపోయినా, పెద్దగా చప్పుడు మాత్రం చేయదు.

పోర్టులు

ముందువైపు ఒక USB-A 3.2 Gen 2 పోర్ట్, ఒక USB-C 3.2 Gen 2 పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్‌సైడ్ రెండు USB-A 3.2 Gen 2 పోర్ట్‌లు, ఒక USB-A 2.0 పోర్ట్, ఒక USB-C 4 పోర్ట్, ఒక HDMI 2.1 పోర్ట్, ఒక డిస్‌ప్లేపోర్ట్ 1.4 కనెక్షన్, ఒక ఈథర్‌నెట్ పోర్ట్ ఉన్నాయి.

ఈ ఐడియాసెంటర్ మినీ ఎక్స్ ఏప్రిల్ 2025 నుంచి మార్కెట్లో లభిస్తుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ 659 డాలర్లు (సుమారు రూ.56,700).

* రెండింటిలోనూ కామన్ ఫీచర్లు

ఈ రెండు మినీ పీసీలలోనూ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ చిప్‌సెట్‌లో ఉన్న ప్రత్యేకమైన NPU (Neural Processing Unit) కారణంగా ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి. రికాల్, MS పెయింట్‌లో జనరేటివ్ ఫిల్, కోక్రియేటర్ వంటి టూల్స్‌ను వీటిలో ఉపయోగించుకోవచ్చు. ఈ NPU సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్ల వరకు చేయగలదు (45 TOPS). ఇది నిజంగా చాలా పవర్‌ఫుల్.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo unveiled Snapdragon-powered ThinkCentre neo 50q and IdeaCentre Mini x mini PCs at CES 2025, offering advanced AI features, powerful specs, and compact designs to rival Apple's Mac Mini.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X