ఐఎఫ్ఏ 2014: లెనోవో నుంచి సరికొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులు

Posted By:

బెర్లిన్‌లో జరుగుతోన్న ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శనను పురస్కరించుకుని చైనాకు చెందిన ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో తన థింక్‌ప్యాడ్, థింక్‌సెంటర్ సిరీస్ నుంచి ఐదు కొత్త శ్రేణి కంప్యూటింగ్ డివైస్‌‍లను ఆవిష్కరించింది. వాటి వివరాలు.. థింక్‌ప్యాడ్ హీలిక్స్, హోరిజోన్ 2ఎస్, హోరిజోన్ 2ఈ, థింక్‌సెంటర్ టైనీ-ఇన్-వన్ 23, ఎడ్జ్ 15.

 ఐఎఫ్ఏ 2014: లెనోవో నుంచి సరికొత్త పోర్టబుల్ కంప్యూటర్లు

ముందుగా సరికొత్త లెనోవో థింక్‌ప్యాడ్ హీలిక్స్ ప్రత్యేకతలు... ఈ 2 ఇన్ వన్ అల్ట్రాబుక్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటెల్ కోర్ ఎమ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ఈ బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ డివైస్‌ను టాబ్లెట్, స్టాండ్, టెంట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఐదు రీతులలో ఉపయోగించుకోవచ్చు. 11.6 అంగుళాల 16:9 ఎఫ్‌హెచ్‌డి తెర (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ప్రాసెసర్ వేరియంట్స్ (ఇంటెల్ కోర్ ఎమ్ / కోర్ ఎమ్ వీ ప్రో ప్రాసెసర్), ర్యామ్ వేరియంట్స్ (4జీబి / 8జీబి), ఇ-డ్రైవ్ వేరియంట్స్ (128జీబి / 256జీబి), మైక్రోహెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, యూఎస్బీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మైక్రోసిమ్, బ్లూటూత్ కనెక్టువిటీ. అంతర్జాతీయ మార్కెట్లో వివిధ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ డివైస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.60,000

 ఐఎఫ్ఏ 2014: లెనోవో నుంచి సరికొత్త పోర్టబుల్ కంప్యూటర్లు

సరికొత్త లెనోవో హోరిజోన్ 2ఇ టేబుల్‌టాప్ పీసీ ప్రత్యేకతలు... 21.5 అంగుళాల విస్తృత సర్దుబాటు (వైడ్ ఎడ్జస్టబుల్) సౌకర్యంతో కూడిన ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, శక్తివంతమైన 4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 1 టాబ్ వరకు హార్డ్‌డిస్క్ డ్రైవ్ లేదా ఎస్ఎస్ హెచ్‌డి హైబ్రిడ్ స్టోరేజ్, 3ఎక్స్ యూఎస్బీ 3.0, హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ, 6 ఇన్ 1 కార్డ్ రీడర్, 2 మెగా పిక్సల్ (1080 పిక్సల్) వెబ్ క్యామ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, బ్లూటూత్, అక్టోబర్ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో వివిధ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ డివైస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.44,940.

సరికొత్త లెనోవో హోరిజోన్ 2ఎస్ ఆల్ ఇన్ వన్ టేబుల్‌టాప్ పీసీ ప్రత్యేకతలు... డివైస్ బరువు 2.5 కిలో గ్రాములు, 19.5 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 500జీబి ఎస్ఎస్ హెచ్‌డి స్టోరేజ్, 2 మెగా పిక్సల్ (1080 పిక్సల్) వెబ్‌క్యామ్, వై-ఫై, బ్లూటూత్, అక్టోబర్ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.62,400.

 ఐఎఫ్ఏ 2014: లెనోవో నుంచి సరికొత్త పోర్టబుల్ కంప్యూటర్లు

సరికొత్త లెనోవో థింక్‌సెంటర్ టైనీ-ఇన్-వన్ 23 మాడ్యులర్ ఆల్ ఇన్ వన్ పీసీ ప్రత్యేకతలు... ఈ మాడ్యులర్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ మెచీన్‌ను ప్రత్యేకించి ఐటీ మేనేజర్ల కోసం డిజైన్ చేసారు. ఈ డివైస్ ప్రత్యేకమైన సీపీయూ ఇంకా మానిటర్‌ను కలిగి ఉంటుంది. 23 అంగుళాల వైడ్ ఎల్ఈడి ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), అక్టోబర్ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.16,790.

 ఐఎఫ్ఏ 2014: లెనోవో నుంచి సరికొత్త పోర్టబుల్ కంప్యూటర్లు

సరికొత్త లెనోవో ఎడ్జ్ 15 డ్యూయల్ మోడ్ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు.. ఈ డ్యూయల్ మోడ్ కంప్యూటింగ్ డివైస్‌ను 300 డిగ్రీల వరకువివిధ రీతులలో వంపుకునే అవకాశాన్ని కల్పించారు. 15.6 అంగుళాల ఐపీఎస్ ఎఫ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఇంటెల్ 4వ తరం కోర్ ఐ7 ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 16జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్, 1టాబ్ హెచ్‌హెచ్‌డి స్టోరేజ్ లేదా 1 టాబ్ హైబ్రీడ్ ఎస్ఎస్ హెచ్‌డి స్టోరేజ్, 1.0 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో కాంబో జాక్,  హెచ్‌డిఎమ్ఐ అవుట్, 4 ఇన్ వన్ కార్డ్ రీడర్, బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ. అక్టోబర్ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.53,940.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo Unveils ThinkPad Helix Ultrabook, Horizon Tabletop PCs, ThinkCenter TIO and Edge 15 Laptop. Read more in Telugu Gizbot........
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot