లెనోవో నుంచి నాలుగు సరికొత్త కన్వర్టబుల్ డివైజ్‌లు!

Posted By: Prashanth

లెనోవో నుంచి నాలుగు సరికొత్త కన్వర్టబుల్ డివైజ్‌లు!

 

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో నాలుగు సరికొత్త కన్వర్టబుల్ డివైజ్‌లను బుధవారం ఆవిష్కరించింది. విండోస్ 8 అదేవిధంగా విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టంలను ఈ డివైజ్‌లు సపోర్ట్ చేస్తాయి. వీటి పేర్లు ఐడియా ప్యాడ్ యోగా 13,

యోగా 11, ఐడియా ట్యాబ్ లైనక్స్, థింక్ ప్యాడ్ ట్విస్ట్.

ఐడియా ప్యాడ్ యోగా 13(IdeaPad Yoga 13): ప్రపంచపు నాజూకైన మల్టీ మోడ్ పీసీగా అభివర్ణింపబడుతున్న ఈ డివైజ్‌ను ల్యాప్‌టాప్ అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. స్రీన్ పరిమాణం 13.3 అంగుళాలు (హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే), మల్టీ టచ్‌స్ర్కీన్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, మూడవ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు, బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. ధర రూ.58,000.

ఐడియా ప్యాడ్ యోగా 11(IdeaPad Yoga 11): స్లిమ్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న యోగా 11ను ల్యాప్‌టాప్ అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. 11.6 అంగుళాల స్ర్కీన్, 13 గంటల బ్యాటరీలైఫ్, విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్. ఈ డివైజ్ ద్వారా ఉన్నతమైన అనుభూతులతో కూడిన హైడెఫినిషన్ చిత్రాలను యూజర్ వీక్షించవచ్చు. ఈ పరికరంలో గేమింగ్ అదేవిధంగా బ్రౌజింగ్ కొత్త అనుభూతులను నింపుతాయి. ధర రూ.42,000.

ఐడియా ట్యాబ్ లైనక్స్ (IdeaTab Lynx):

ఈ విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ సరికొత్త డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. స్ర్కీన్ పరిమాణం 11.6 అంగుళాలు. మల్టీ టచ్‌స్ర్కీన్, డాక్ ఆధారితంగా కీబోర్డ్‌ను జతచేసుకునే సౌలభ్యత. 16 గంటల బ్యాటరీ లైఫ్, సినిమా క్వాలిటీ సౌండ్ సిస్టం. ప్రింటర్స్, హార్డ‌డ్రైవ్స్ అదేవిధంగా ఇతర విడిభాగాలకు డివైజ్‌ను సునాయాశంగా జత చేసుకోవచ్చు. ధర రూ.32,000

థింక్‌ప్యాడ్ ట్విస్ట్(ThinkPad Twist):

ప్రొఫెష‌నల్స్ కోసం డిజైన్ చేయబడిన ఈ డివైజ్ బిజినెస్ అదేవిధంగా పర్సనల్ కంప్యూటింగ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తుంది. ఈ అత్యాధునిక కంప్యూటింగ్ పరికరాన్ని అల్ట్రాబుక్, అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 12.5 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్, ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్, ఆప్షనల్ 3జీ, 128జీబి ఎస్ఎస్‌డి, డాల్బి హోమ్ ధియోటర్ ఆడియో, హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, డిస్‌ప్లే పోర్ట్ జాక్. ధర రూ.45,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting