ఆపిల్‌ ప్లేస్‌కు లెనోవో ఎర్త్?

Posted By: Prashanth

ఆపిల్‌ ప్లేస్‌కు లెనోవో ఎర్త్?

 

పర్సనల్ కంప్యూటర్ల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో కొనసాగుతున్న లెనోవో, మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఆపిల్‌కు చెక్‌పెట్టే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. విండోస్ 8 ఆధారితంగా పనిచేసే సరికొత్త కంప్యూటింగ్ గ్యాడ్సెట్ ‘థింక్‌ప్యాడ్ టాబ్లెట్ 2’ని లెనోవో ఈ అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆప్షనల్ స్టైలస్ ఇన్‌పుట్ ప్రత్యేకతతో విడుదల కాబోతున్న ఈ డివైజ్ ఆపిల్ ఐప్యాడ్‌కు సరైన పోటీనివ్వగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

థింక్‌ప్యాడ్ టాబ్లెట్ 2 ఫీచర్లు (స్లాష్‌గేర్ నివేదికలు ఆధారంగా):

10.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),

ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

శక్తివంతమైన బ్యాటరీ (10గంటల బ్యాకప్),

ఆప్షనల్ స్టైలస్,

ఫింగర్ ప్రింట్ రీడర్,

8మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఇంటిగ్రేటెడ్ 3జీ,4జీ,

డెస్క్‌టాప్ డాక్,

హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్,

యూఎస్బీ పోర్ట్స్,

వైరుడ్ ఇతర్‌నెట్,

పీసీ మందం 600 గ్రాములు,

9.8మిల్లీమీటర్ల మందం.

పోటీ ఏలా ఉండబోతోంది..?

టాబ్లెట్ కంప్యూటర్ల విభాగాన్ని గత కొంత కాలంగా ఆపిల్ శాసిస్తున్న విషయం తెలిసిందే. ఆర్మ్ ఆధారిత విండోస్ 8 టాబ్లెట్‌లు ఆపిల్, సామ్‌సంగ్‌ల ఆధిపత్యానికి గండికొట్టే ప్రమాదముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ అప్‌గ్రేడెడ్ ఆపరేటింగ్ సిస్టం ఆర్మ్ ఇంకా x86 చిప్‌లను సపోర్ట్ చేయటమే ఇందుకు కారణమట. ఉన్నత స్ధాయి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ‘థింక్‌ప్యాడ్ టాబ్లెట్ 2’ ఆపిల్‌కు ఖచ్చితంగా గట్టిపోటీనివ్వగలదని పలువురు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot