లెనెవో తింక్ ప్యాడ్, ఇప్పుడు ప్రొఫెషనల్స్ కోసం..!!

Posted By: Super

లెనెవో తింక్ ప్యాడ్, ఇప్పుడు ప్రొఫెషనల్స్ కోసం..!!

‘‘ ప్రపంచ వ్యాప్తంగా చాంతాడంత అభిమానం.. వినియోగదారుల్లో చెక్కు చెదరని విశ్వసనీయత.. తాజాగా ప్రొఫెషనల్స్‌కు చేరువయ్యే ప్రయత్నం ’’

ప్రముఖ కంప్యూంటింగ్ పరికరాల తయారీదారు ‘లెనోవో’ వ్యాపార వర్గాలు మరియు ఇతర రంగాల ‘ప్రొఫెషనల్స్’ను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైంది. అపడేటెట్ ఫీచర్లు మరియు అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో ప్రొఫెషనల్ ల్యాపీని మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు షురూ చేస్తుంది.

‘లెనోవో థింక్ ప్యాడ్ X121e’ వర్షన్లో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ 11.6 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 1366 x 768 పిక్సల్ రిసల్యూషన్, LED బ్యాక్లిట్ మరియు LCD హై డెఫినిషన్ అంశాలు వాడకందారులకు మరింత లబ్ధి చేకూరుస్తాయి.

మైక్రోసాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో లోడ్ చేశారు. ఇంటెల్ కోర్ M ప్రాసెసర్ మరియు ‘ఇంటెల్ HD 3000’ లేదా ‘రేడియన్ HD 6310’ వ్యవస్థలను పొందుపరచవచ్చని తెలుస్తోంది. 4జీబీ ర్యామ్‌ను 8 జీబీకి పెంచుకునే సౌలభ్యతను కల్పించనున్నారు. హార్డ్ డిస్క్ సామర్ధ్యం 320 జీబీ.

4-in-1 మీడియా కార్డ్ రీడర్, యూఎస్బీ 2.0 పోర్ట్స్, ఆధునిక వర్షన్ బ్లూటూత్, 802.11 b/ g/ n వై-ఫై అంశాలను కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టతం చేస్తాయి. ‘HDMI’ అవుట్ పుట్ వ్యవస్థను ల్యాపీలో కల్పించారు.

ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన ‘కీబోర్డు’ సౌకర్యవంతమైన ఒత్తిడి లేని టైపింగ్‌కు ఉపకరిస్తుంది. లైవ్ వీడియో ఛాటింగ్ చేసుకునే విధంగా 0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్‌ను ల్యాపీలో ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ల్యాపీలో అమర్చిన 6 సెల్ లితియమ్ బ్యాటరీ వ్యవస్థ 8.2 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ధర మరియు ఇతర అంశాలకు సంబంధించి పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot