మార్కెట్లోకి లెనోవో లేటెస్ట్ ల్యాప్‌టాప్, ధర రూ.85,490

లెనోవో తన లేటెస్ట్ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ 'Yoga 710'ను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.85,490. లెనోవో స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెష‌నల్స్ కోసం డిజైన్ చేయబడిన ఈ డివైజ్ బిజినెస్ అదేవిధంగా పర్సనల్ కంప్యూటింగ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తుంది.

మార్కెట్లోకి లెనోవో లేటెస్ట్ ల్యాప్‌టాప్, ధర రూ.85,490

ఈ అత్యాధునిక కంప్యూటింగ్ పరికరాన్ని అల్ట్రాబుక్, అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు.180 డిగ్రీ రోటేటబుల్ ఫీచర్ తో వస్తోన్న ఈ ల్యాపీ బరువు 1.55 కిలో గ్రాములు మాత్రమే. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్‌కు పోటీగా లాంచ్ అయిన లెనోవో యోగా 710 ల్యాపీ స్పెసిఫికేషన్‌లను ఓ సారి చూద్దాం...

Read More : Opera బ్రౌజర్ ఎందుకంత బెస్ట్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే..

14 అంగుళాల ఫుల్ హైడెపినిషన్ ఐపీఎస్ మల్టీటచ్ డిస్‌ప్లే. ల్యాపీ ప్రత్యేకతలు : టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, 180 డిగ్రీ రోటేటబుల్ ఫీచర్,

ప్రాసెసర్

6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-6500U ప్రాసెసర్, 8జీబి డీడీఆర్4 ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ 940ఎమ్ఎక్స్ గ్రాఫిక్ కార్డ్,

స్టోరేజ్ వ్యవస్థ

ల్యాపీ డేటా స్టోరేజ్ నిమిత్తం 256జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్ డ్రైవ్.

ఆపరేటింగ్ సిస్టం

లెనోవో యోగా 710 ల్యాప్‌టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

బ్యాటరీ

ఈ ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 8 గంటల అంతరాయం లేని బ్యాకప్‌ను అందిస్తుందని లెనోవో చెబుతోంది.

ఇన్నోవేటివ్ యాంటీనా

లెనోవో యోగా 710 ల్యాప్‌టాప్ లో వై-ఫై కనెక్టువిటీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు వినూత్న యాంటెన్నావ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ యాంటీనా సిగ్నల్ వ్యవస్థను 20 శాతం మరింతగా మెరుగుపరుస్తుంది.

డాల్బీ ఆడియో

ఈ ల్యాపీలో నిక్షిప్తం చేసిన డాల్బీ ఆడియో ప్రీమియమ్ వ్యవస్థ హైక్వాలిటీ సౌండ్‌ను ఆఫర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Yoga 710 Now Available in India at Rs.85,490. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot