లెనోవో నుంచి రెండు కొత్త ట్యాబ్లెట్‌లు (18 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో)

Posted By:

ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో తన‘యోగా టాబ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 18గంటల బ్యాటరీలైఫ్ సామర్ధ్యాన్ని కలిగి ఈ టాబ్లెట్ ‘యోగా 8', ‘యోగా 10' వేరియంట్‌లలో లభ్యమవుతోంది. యోగా 8 వేరియంట్ 8 అంగుళాల డిస్‌ప్లే సైజును కలిగి ఉంటుంది. ధర రూ.22,999. మరో వేరియంట్ యోగా 10, 10 అంగుళాల డిస్‌ప్లే సైజును కలిగి ఉంటుంది. ధర రూ.28,999. మల్టీ మోడ్ ఫీచర్‌ను కలిగి ఉన్న ఈ టాబ్లెట్ పీసీలను మూడు విభిన్న రీతులలో ఉపయోగించుకోవచ్చు. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉన్న ఈ టాబ్లెట్‌లు 18 గంటల బ్యాకప్‌ను అందిస్తాయి.

 లెనోవో నుంచి రెండు కొత్త ట్యాబ్లెట్‌లు (18 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో)

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

ఈ రెండు టాబ్లెట్ మోడల్స్‌లో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను వినియోగించారు. వై-ఫై వేరియంట్‌లు మీడియాటెక్ ఎంటీ8125 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. అలాగే, 3జీ వేరియంట్‌లు ఎంటీ8389 ప్రాసెసర్‌లను కలిగి ఉంటాయి. రెండు టాబ్లెట్‌లలో ర్యామ్ సామర్ధ్యం 1జీబి. ఈ పోర్టబుల్ పీసీలను 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 5 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, వీడియో చాటింగ్ నిర్వహించుకునేందకు వీజీఏ ఫ్రంట్ కెమెరా.

నవంబర్ 24లోపు ఈ టాబ్లెట్‌లను కొనుగోలు చేసే వారికి లెనోవో ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. లెనోవో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు 8 అంగుళాల యోగా టాబ్లెట్‌ను కొనుగోలు చేసినట్లయితే బండిల్ ప్యాక్ క్రింది మొత్తం రూ.4,000 విలువ చేసే స్లీవ్ కవర్, స్ర్కీన్ ప్రొటెక్టర్ ఇంకా ఇయర్ ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు.10 అంగుళాల యోగా ట్యాబ్లెట్ కొనుగోలు పై బండిల్ ప్యాక్ క్రింద రూ.5,000 విలువ చేసే స్లీవ్ కవర్, స్ర్కీన్ ప్రొటెక్టర్ ఇంకా ఇయర్ ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరి!!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot